English | Telugu
'కింగ్' సరసన ఇద్దరు!
Updated : Feb 13, 2023
కింగ్ నాగార్జున గత ఏడాది ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ది ఘోస్ట్ అనే సినిమా చేశారు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా రూపొందింది. డిఫరెంట్ కాన్సెప్ట్ గా మిగిలిపోయింది. ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. దాంతో అది డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా కాన్సెప్ట్ కామన్ ఆడియన్స్ కు అర్థం కావడం లేదు. అదే ఫెయిల్యూర్ కు ప్రధాన కారణం. దీని తర్వాత నాగార్జున లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. యంగ్ టాలెంటెడ్ రైటర్ కి దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. సినిమా చూపిస్త మామ, నేను లోకల్, ధమాకా సినిమాలతో రైటర్ గా సూపర్ సక్సెస్ అందుకున్న టాలెంటెడ్ యంగ్ రచయిత ప్రసన్నకుమార్ బెజవాడ. ఇప్పుడు ఇతను దర్శకుడిగా మెగా ఫోన్ చేపట్టబోతున్నారు.
కింగ్ నాగార్జున ప్రసన్నకుమారికి అవకాశం ఇచ్చి దర్శకునిగా పరిచయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ధమాకా నిర్మించిన తర్వాత నిర్మాత ఇప్పుడు నాగార్జున ప్రసన్నకుమార్ బెజవాడ కాంబినేషన్లో మూవీ నిర్మించబోతూ ఉండడం విశేషం. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించబోతున్నారు. సీతారామం సేమ్ మృణాల్ ఠాకూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
యంగ్ టాలెంటెడ్ హీరోయిన్, మల్లు బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో కనిపించబోతుందని సమాచారం. నాగార్జున రికమండేషన్ చేసి ఆమెను తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి ఆమె పాత్ర సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి? ఇక మృణాల్ ఠాకూర్ విషయానికి వస్తే ఆమె నాని 30వ చిత్రంలో నటిస్తోంది. కింగ్ నాగార్జునతో నటించబోయే సినిమా ఆమెకు మూడో చిత్రం అవుతుంది.