English | Telugu
మరోసారి అదే దర్శకునితో నాగచైతన్య!
Updated : Feb 13, 2023
యంగ్ హీరో నాగచైతన్య గత ఏడాది థాంక్యూ సినిమా చేశారు. ఇది డిజాస్టర్ అయింది. పెట్టిన పెట్టుబడిలో సగం కూడా కలెక్ట్ కాలేదని టాక్ ఉంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వెంకట ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య కస్టడీ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. ఇందులో ఆయన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడట. పోలీస్ ఆఫీసర్ గా ఉన్న చైతన్య ఎందుకు కస్టడీ ఖైదీగా మారాడు అనే ఎలిమెంట్తో ఈ మూవీ కథాంశం ఉండబోతుందని టాక్. ఇందులో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తుంది. రెగ్యులర్ హీరోయిన్ లా కాకుండా కథలో చాలా కీలకమైన పాత్రను ఆమె పోషిస్తున్నట్లు సమాచారం. వెంకట్ ప్రభు సినిమాలు రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ కు దూరంగా ఉంటాయి.
ఈ నేపథ్యంలో ఆయన చైతన్యతో చేస్తున్న చిత్రంపై హైప్ క్రియేట్ అయింది. థాంక్యూ కంటే ముందు లవ్ స్టోరీ అనే సినిమాతో నాగచైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సూపర్ హిట్ కొట్టారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా ఈ సినిమా తెరకెక్కింది. కులాల అంతరం ఉన్న అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమని శేఖర్ కమ్ముల తనదైన శైలిలో తెరకెక్కించి హిట్టు కొట్టారు. కాగా కస్టడీ తర్వాత నాగచైతన్య మరోసారి శేఖర్ కమ్ముల దర్శత్వంలో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. శేఖర్ కమ్ముల ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో ద్విభాషా చిత్రం చేస్తున్నారు.
ఈ సినిమాని అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తోంది. మరోవైపు ధనుష్ సార్ మూవీ రిలీజ్కు రెడీగా ఉంది. కెప్టెన్ మిల్లర్ అనే పాన్ ఇండియా మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇక ధనుష్తో శేఖర్ కమ్ముల చిత్రం పూర్తయిన తర్వాత నాగచైతన్య-శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో లవ్ స్టోరీ తర్వాత మరో చిత్రం ఉంటుందని సమాచారం.