English | Telugu

ఆ విషయంలో నాగార్జున కరెక్ట్ అంటున్న జగపతిబాబు!

జగపతిబాబు... టాలీవుడ్‌లో శోభన్ బాబు తర్వాత ఫ్యామిలీ హీరోగా మహిళా అభిమానులను ఆ రేంజ్ లో సొంతం చేసుకున్నారు. విలక్షణ పాత్రలతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. క్షేత్రం తరువాత హీరో పాత్రలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు.  సరికొత్త ఇన్నింగ్స్ శ్రీకారం చుట్టారు. బాలకృష్ణ నటించిన బోయపాటి శ్రీను చిత్రం లెజెండ్ సినిమాతో పవర్ఫుల్ విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఇందులో జగపతిబాబు నటనకు ప్రత్యేక ప్రశంసలు లభించాయి. ఈ మూవీతో విలన్ పాత్రల‌కు  కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారు.  జగపతిబాబు ఇప్పటికీ అదే తరహా పాత్రలో నటిస్తూ వస్తున్నారు. ప్రభాస్- ప్రశాంత నీల్  కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ సలార్ లో  పవర్ఫుల్ విల‌న్  రాజమానారుగా కనిపిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

అందరు ప్రేమ్ రక్షిత్ కావాలంటున్నారు!

మట్టిలో మాణిక్యాలు అనే ఊత‌ప‌దం ఊరికే రాలేదు. ఈ సామెత‌కు ఎంద‌రినో ఉదాహ‌ర‌ణ‌గా చెప్ప‌వ‌చ్చు. ఎవ‌రైనా క‌ష్ట‌ప‌డందే పైకి రారు. ఇక విషయానికి వ‌స్తే మ‌ట్టిలో మాణిక్యం అనే  ఆ కోవలోకి చెందిన వ్యక్తి ప్రేమ రక్షిత మాస్టర్ కూడా. నాటు నాటు సాంగ్ తో  ప్రపంచం మొత్తం మారుమోగేలా చేసిన  సంగతి తెలిసిందే. ఇటీవల ఈ పాట ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యింది. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని మరో మెట్టెక్కించింది. అయితే దేశం మొత్తం గర్వించేలాగా చేసిన ప్రేమ్  రక్షిత్ మాస్టర్ ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డారు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. ఇప్పుడు ఆయన తన సక్సెస్ తో ప్రస్తుతం వ‌రుస  సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. భారీ అవకాశాలు వస్తున్నాయి. భారీ బడ్జెట్ తో  రూపొందుతున్న స్టార్ హీరోల చిత్రాలకు పని చేస్తున్నారు. దర్శక నిర్మాతలు హీరోలు ఆయనతో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.వరుస చాన్సులతో ఖాళీ లేకుండా ఉన్నారు. 

స్టార్స్ ప్లాన్ వ‌ర్కౌట్ అయితే ఇక‌ అదుర్స్!

సినిమా బాగుండడమే కాదు ఆ సినిమా సక్సెస్ కావాలంటే ఎన్నో అంశాలు కలిసి రావాలి. పోటీగా సినిమాలు లేకుండా ఉండాలి. మంచి ప్రమోషన్ చేయాలి. సినిమా కంటెంట్ నచ్చేలా ఉండాలి.. సరైన సమయంలో విడుదల చేయాలి. అనుకున్న బడ్జెట్‌లో పూర్తి చేయాలి. ప్రేక్షకులను దియేటర్లకు ర‌ప్పించేలా  చేయగలగాలి... ఇలాంటి అంశాలు ఎన్నో కలిస్తేనే ఓ సినిమా సక్సెస్ అవుతుంది. ఈ విషయంలో మన టాలీవుడ్ మేకర్స్ ఇప్పుడు సరికొత్త పంథాను అనుసరిస్తున్నారు. నాని దసరా, ప్రభాస్ సలార్,  ఎన్టీఆర్ 30 చిత్రాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దసరా చిత్రం మార్చి 30న అంటే గురువారం విడుదల కానుంది...

అల్లు అర్జున్ రికార్డ్‌ను చిరంజీవి బద్దలు కొడతాడా!

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన  వాల్తేరు వీరయ్య చిత్రం జనవరి 13వ తేదీన విడుదల అయింది. ఈ చిత్రం సంక్రాంతి విజేతగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. 200 కోట్లకు పైగా వసూలు చేసింది. బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. వింటేజీ మెగాస్టార్ ను వెనక్కి తీసుకుని వచ్చింది. ఫిబ్రవరి 27 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమా ఓటీటీ విడుదలకు రంగం సిద్ధమవుతోంది. అయితే ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమా విడుద‌లై నెల‌రోజులు దాటింది.  అయినా సరే ఇప్పటికీ 300 థియేటర్లలో సినిమా ఆడుతోంది.