టైర్ 1 స్టార్లకు గట్టి పోటీ ఇస్తున్న టైర్ 2 హీరోలు!
టాలీవుడ్ లో టైర్ 1 హీరోల జాబితా తీసుకుంటే అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్లు చాలామంది కనిపిస్తారు. వీరి సినిమా బడ్జెట్ 100 కోట్లు దాటుతున్నాయి. వీరి రెమ్యూనరేషన్ 50 కోట్లకు పైగానే ఉంటుంది. ఇక వీరితో సినిమా అంటే దాదాపు 100 నుంచి 150 కోట్లకు బడ్జెట్ రెడీ చేసుకోవాలి. సినిమాకు మంచి టాక్ వస్తే 200 కోట్లను ఈజీగా టార్గెట్ చేస్తున్నారు. ఆపైన హిట్ టాక్ వస్తే ఎంతైనా సంపాదించవచ్చు...