English | Telugu

అయోమ‌యానికి గురి చేస్తోన్న ప‌వ‌న్!

పవన్ ఇటు సినిమాలతోనూ అటు రాజకీయాలతోనూ బిజీ బిజీగా ఉన్నారు. తన వారాహి రథంపై యాత్ర ప్రారంభించారు. ఏపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బయలుదేరారు. తెలంగాణతో పాటు ఏపీ రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తానని ప్రకటించారు. అటు  సినిమాలతో అటు రాజకీయాల్లో బిజీ బిజీగా పవన్ గడుపుతున్నారు. ఆయన దేనికి టైం కేటాయిస్తారు? ఎప్పుటి నుంచి కేటాయిస్తాడు? అని  అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కనీసం ఒక్క సినిమా పూర్తి చేసి విడుదల చేస్తే తమ హీరోను వెండి తెర‌పై చూడొచ్చని ఆశపడుతున్నారు. ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లు సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 2020లో ప్రారంభమైంది. ఇప్పటివరకు పూర్తి కాలేదు. వాయిదాలు పడుతూ వస్తుంది. ఈ సినిమాని వెంటనే పూర్తి చేయాలని పవన్ నిర్ణయించుకున్నాడు. 

నాలుగు జాతీయ అవార్డులు సాధించిన దర్శకుడితో యంగ్ టైగర్!

ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ నటించబోయే తదుపరి చిత్రం ఇంకా సెట్స్  పైకి వెళ్ళలేదు. ఎన్టీఆర్ తో కొర‌టాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొంద‌నుంది.  దీనికి ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ సినిమా తరువాత జూనియర్ ఎన్టీఆర్ కేజిఎఫ్ ఫ్రాంచైజ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఓ చిత్రం చేయనున్నారు. ఆ తరువాత ఆయన ఓ తమిళ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది. కొరటాల శివ సినిమాని ఈనెల 20వ తేదీన లాంచనంగా పూజతో ప్రారంభించి మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టబోతున్నారు. ఇక తమిళ దర్శకుడు వెట్రిమార‌న్  దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ కోసం మైత్రి మూవీ సంస్థ ఐదు కోట్ల అడ్వాన్స్ కూడా వెట్రిమార‌న్ కి ఇచ్చిందని సమాచారం... 

అదే డేట్‌కి ఫిక్స్ అయిన సలార్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి -ది బిగినింగ్, బాహుబలి-ది కంక్లూషన్ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు.  ఈయనకు ఇప్పుడు ఇండియాలోనే కాదు ఇతర దేశాలలో కూడా బాగా గుర్తింపు ఉంది. కానీ బాహుబలి 2 భాగాల తర్వాత ఆయన నటించిన సాహూ రాధేశ్యామ్  చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. దాంతో తదుపరి ప్రభాస్ చేయబోయే చిత్రం  అందరిలో ఆసక్తిని రేపుతోంది.  ఈ చిత్రం కోసం ప్రభాస్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. సాహో రాధేశ్యామ్  చిత్రాల పరాజయాలకు దీటుగా స‌లార్  సంచలనం సృష్టిస్తుందని వారు ఎంతో ఆశతో ఉన్నారు. అందునా  ప్రశాంతినీల్ కేజీఎఫ్ ఫ్రాంచైజీ  ద‌ర్శ‌కుడైన ప్ర‌శాంత్ నీల్ తో ఈ చిత్రం రూపొందుతూ ఉండ‌టంతో అంచ‌నాలు అంబ‌రాన్ని చుంబిస్తున్నాయి. 

ఈ కొత్త దర్శకుడి కోసం కర్చీఫ్‌లు వేస్తున్నారు!

ఒక డైరెక్టర్ సినిమా బ్లాక్ బస్టర్ అయిందంటే ఆయా దర్శకులకు కర్చీఫులు వేయడం నిర్మాతలకు, హీరోలకు తెలుగులో చాలా సహజం. కానీ ఒక డైరెక్టర్ తీసిన సినిమా ఇంకా విడుదల కాకుండానే కేవలం ట్రైలర్ చూసి ఆ దర్శకుడిని లైన్ లో పెట్టాలని భావిస్తూ ఉండడం కాస్త ఆశ్చర్యకరమైన విషయమే. కానీ ఇది వాస్తవం. విషయానికి వస్తే ప్రస్తుతం నాని దసరా అని చిత్రం చేస్తున్నారు. ఊర మాసివ్ అవతార్‌లో నాని కనిపిస్తున్నారు. ఈ సినిమా లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. సుకుమారు శిష్యుడైన శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన దగ్గర నుంచి ఈ మూవీలో నాని లుక్, మేకోవర్ పై చర్చ జరుగుతుంది. ర‌గ్గ్ఢ్ లుక్ లో నాని  కనిపించడంతో అంత షాక్ అవుతున్నారు... 

పాట‌, ఫైట్ చేస్తున్న ర‌జ‌నీకాంత్‌

లాస్ట్ ఇయ‌ర్ సంక్రాంతికి అన్నాత్తే సినిమాతో జ‌నాల ముందుకు వ‌చ్చారు ర‌జ‌నీకాంత్‌. ఇప్పుడు జైల‌ర్ సినిమా చేస్తున్నారు. లాస్ట్ ఇయ‌ర్ సంక్రాంతికి విజ‌య్‌తో బీస్ట్ సినిమాను రూపొందించిన నెల్స‌న్ దిలీప్‌కుమార్ ఈ సినిమాకు డైర‌క్ట‌ర్‌. దాదాపు 75 శాతం షూటింగ్ కూడా పూర్త‌యింది. ప్ర‌స్తుతం రాజ‌స్థాన్‌లో షూటింగ్ జ‌రుగుతోంది. జాకీ ష్రాఫ్‌, మోహ‌న్‌లాల్‌, శివ‌రాజ్‌కుమార్‌, ర‌మ్యకృష్ణ‌, త‌మ‌న్నా, సునీల్‌, యోగిబాబు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అనిరుద్ సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఫైట్స్ తెర‌కెక్కిస్తున్నారు మేక‌ర్స్...