English | Telugu

ఐదేళ్లలో ఐదు చోట్ల.. భలే తెలివైన హీరోయిన్!

దీపం ఉన్నప్పుడు ఇళ్లు చక్కబెట్టుకోవాలనే సామెత అందరికీ తెలిసిందే. డిమాండ్ ఉన్నప్పుడే రేటు పెంచేసుకోవాలన్న సంగతి తెలిసిందే. ఈ విషయాలు హీరోయిన్లకు బాగా సరిపోతాయి. అందుకే తమకు క్రేజ్ ఉన్నప్పుడే రెమ్యూనరేషన్లు పెంచేసుకుంటారు. వచ్చిన ప్రాజెక్ట్‌లను చేసుకుంటూ పోతారు. వచ్చిన డబ్బులను కొంత మంది పొదుపుగా వాడుకుంటారు. ఇంకొందరు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేసుకుంది. కానీ కొంత మంది మాత్రం డబ్బును సరిగ్గా వాడుకుంటారు. అలాంటి వారిలో రష్మిక మందన ఇప్పుడు ముందున్నట్టుంది.

రష్మిక ఈ ఐదేళ్లలో ఐదు చోట్ల లగ్జరీ భవంతులను కొనేసిందట. ఒక్కో ఏడాది ఒక్కో ఏరియాలో ఇళ్లు కొనేసి స్థిరాస్థి రూపంలో డబ్బును పోగేస్తోందన్న మాట. ఇలా ఈ ఐదేళ్లలో హైద్రాబాద్, ముంబై, కూర్గ్, గోవా, బెంగళూరులో ఇళ్లు కొనేసిందట. ఇక ఈ ఇంటి వాల్యూ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది తప్పా తరిగిపోయేది కాదు. ఇలా తనకు వచ్చిన డబ్బులన్నీ కూడా తెలివిగా వాడేసుకుంటోందనిపిస్తోంది.

రష్మిక క్రేజ్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాలే కాకుండా ప్రకటనల రూపంలోనూ రష్మిక సంపాదించేస్తోంది. రష్మిక దూకుడు చూస్తుంటే ఇంకా చాలా కాలమే నెంబర్ వన్ స్థానంలో ఉండేట్టు కనిపిస్తోంది. హిట్లు రాకపోయినా కూడా రష్మిక స్పీడు మాత్రం తగ్గడం లేదు. గత ఏడాది ఆడాళ్లు మీకు జోహార్లు అంటూ వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సరిగ్గా ఆడలేదు.

ఇప్పుడు విజయ్ వారసుడు సినిమాతో పలకరించింది. తెలుగులో సోసోగా అనిపించుకుంది. కానీ కోలీవుడ్‌లో ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. మూడు వందల కోట్ల క్లబ్బులో చేరింది. అలా విజయ్ సరసన చేసిన ఈ సినిమాతో రష్మికకు కోలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ ఏర్పడింది. కార్తీ సుల్తాన్ సినిమా ఉపయోగపడకపోయినా.. విజయ్ వారిసు బాగానే కలిసి వచ్చింది.

ఇప్పుడు బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ఇలా అన్ని చోట్లా రష్మిక హవానే సాగుతోంది. ఒక్కో సినిమా రెండు నుంచి మూడు కోట్లు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు రష్మిక పుష్ప ది రూల్ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నట్టు సమాచారం.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.