English | Telugu
'సామజవరగమన' అంటున్న శ్రీవిష్ణు
Updated : Feb 14, 2023
విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో శ్రీవిష్ణు మరో ఆసక్తికరమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. 'వివాహ భోజనంబు' ఫేమ్ రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకుడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో హాస్య మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'సామజవరగమన' అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. శ్రీవిష్ణు ఎక్కువగా తెలుగు టైటిల్స్ కి మొగ్గుచూపుతాడు. ఆ సాంప్రదాయాన్ని ఫాలో అవుతూ మరోసారి తెలుగు టైటిల్ కే ఓటేశాడు. పైగా ఇది అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో'లోని సూపర్ హిట్ సాంగ్ కావడం విశేషం. దీంతో ఈ టైటిల్ ప్రేక్షకులకు త్వరగా చేరువయ్యే అవకాశముంది.
టైటిల్ తో పాటు కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. అందులో సంగీత పరికరం వీణతో పాటు శ్రీవిష్ణుని కట్టేసినట్లుగా ఉంది. వెన్నెల కిషోర్, నరేష్, శ్రీకాంత్ అయ్యంగర్, రెబా మోనికా ఒక్కొక్కరు ఒక్కో ఎక్స్ ప్రెషన్ తో తాళ్ళను పట్టుకొని ఉన్నారు. పోస్టర్ చూస్తుంటే శ్రీవిష్ణుకి సంగీతమంటే ఇష్టం లేకపోయినా.. తప్పనిసరి పరిస్థితుల్లో చుట్టూ ఉన్న వారి కోసం నేర్చుకోవాల్సి వచ్చింది అన్నట్లుగా ఉంది. ఇది కామెడీ ఎంటర్టైనర్ అని, ఈ వేసవిలో నవ్వులు పూయిస్తుందని మేకర్స్ ప్రకటించారు. గతేడాది భళా తందనానా, అల్లూరి సినిమాలతో నిరాశపరిచిన శ్రీవిష్ణు.. ఈ ఏడాది సమ్మర్ లో వస్తున్న 'సామజవరగమన'తో ఆకట్టుకొని సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.