English | Telugu

త‌ప్పు తెలుసుకున్నానంటున్న బుట్ట‌బొమ్మ‌

మ‌న చేతుల్లో ఏవీ లేదు. అంతా భ‌గ‌వంతుడి ద‌య‌. అలాగ‌ని మొత్తం భారం అంతా దేవుడి మీద వేసి తిర‌గ‌కూడ‌దు. మంచీ చెడుల గురించి మాట్లాడుకోవాల‌ని అంటున్నార‌ట పూజా హెగ్డే. ఇప్పుడు కోలీవుడ్‌లో పూజా హెగ్డే వేదాంతం మాట్లాడుతున్నార‌నే వార్త‌లు స్ప్రెడ్ అవుతున్నాయి. లాస్ట్ ఇయ‌ర్ పూజా హెగ్డే చేసిన బీస్ట్, రాధేశ్యామ్‌, హిందీ స‌ర్క‌స్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌రిగా ప్రూవ్ చేసుకోలేక‌పోయాయి. ఆచార్య‌లో న‌టించినా ఆ సినిమా కూడా పూజాకి స‌క్సెస్ ఇవ్వ‌లేదు. అందుకే ఇప్పుడు చేస్తున్న సినిమాల మీదే ఎక్కువ కాన్‌సెన్‌ట్రేట్ చేస్తున్నారు పూజా. ఆమెకు బుట్ట‌బొమ్మ అనే పేరు తెచ్చిపెట్టిన అర‌వింద స‌మేత, అల వైకుంఠ‌పుర‌ములో కెప్టెన్‌ త్రివిక్ర‌మ్‌తో క‌లిసి మ‌ళ్లీ ప‌నిచేస్తున్నారు పూజా హెగ్డే. మ‌హేష్ హీరోగా న‌టిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగ‌స్టులో విడుద‌లవుతుంద‌ని స‌మాచారం. దాంతో పాటు కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ కూడా ఈ ఏడాది ఈద్‌కి రిలీజ్‌ని ఫైన‌ల్ చేసుకుంది.

ఈ సినిమాలు రెండిటి మీద పూజా హెగ్డే మ‌రిన్ని హోప్స్ పెట్టుకున్నారు. ఎవ‌రైనా స‌రే ఫెయిల్యూర్ వ‌చ్చిన‌ప్పుడు బాధ‌ప‌డుతూ కూర్చోకూడ‌ద‌న్న‌ది పూజా హెగ్డే చెబుతున్న మాట‌. ``కొన్నిసార్లు మ‌న నిర్ణ‌యాలు త‌ప్పు అవుతాయి. అంత‌మాత్రాన మనం చేస్తున్న ప‌నుల‌ను ఆపి బాధ‌ప‌డ‌కూడ‌దు. మ‌నం ఏం చేస్తున్నామ‌న్న‌ది తెలుసుకుని చేయాలి. కొన్నిసార్లు వ‌రుస‌గా ఫెయిల్యూర్‌లు ప‌ల‌క‌రిస్తున్న‌ప్పుడు ఒక‌చోట ఆగి నిదానంగా ఆలోచించుకోవాలి. నేను కూడా చాలా సార్లు అదే ప‌నిచేశాను. నా త‌ప్పులు తెలుసుకుని స‌రిదిద్దుకున్నాను. అనుకున్న స్థాయికి ఎదిగాను``అని అన్నారు పూజా హెగ్డే. ప్యాన్ ఇండియా రేంజ్‌లో టాప్ హీరోయిన్ గా నిల‌దొక్కుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్నారు పూజా హెగ్డే. ఎప్పుడూ సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటున్నారు.