ధైర్యంగా ఫ్లాఫ్ దర్శకులకు ఛాన్స్ ఇస్తున్న చిరు!
150 చిత్రాల వరకు ఆచితూచి అడుగులు వేస్తూ కేవలం భారీ దర్శకులు విజయాలను అందుకున్న దర్శకుల వైపు చూస్తూ వారికే అవకాశం ఇస్తూ వచ్చిన చిరంజీవి రీ ఎంట్రీ లో మాత్రం భిన్నంగా సాగుతున్నారు. పిలిచి మరి కొత్త దర్శకులకు అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అసలు విజయం అనేది ఎరుగని మెహర్ రమేష్ కు పిలిచి మరీ ఛాన్స్ ఇవ్వడం అంటే ఒక్కసారిగా ఎవరైనా స్టన్ అయిపోతారు. మెహర్ రమేష్ సంగతి అందరికీ తెలిసిందే. కంత్రి, బిల్లా, శక్తి, షాడో వంటి చిత్రాలతో ఈయన జనాలను పిచ్చెక్కించారు.