English | Telugu

భర్తని అవమానించిన స్టార్ హీరో పై పగ తీర్చుకున్న నయన!

ప్రస్తుతం కోలీవుడ్ లోనే కాదు దక్షిణాదిలో ఇంకా చెప్పాలంటే ఇండియాలో కూడా లేడీ సూపర్ స్టార్ ఎవరు అంటే నయనతార పేరే చెబుతారు. ఫిలిం మేకర్స్ కి ఆమె అంటే భయం. ఆమె పెట్టే కండిషన్లన్నీటికి వారు ఒప్పుకుంటారు. ఆమె ఆడిందే ఆట పాడిందే పాట‌గా ఆమె హ‌వా సాగుతోంది. ఆమె ఏం చెబితే అదే చెల్లుబాటు అవుతుంది. ఒక స్టార్ హీరోకు ఉన్న కమాండ్ ఈమెకు ఉంది. ఈమె గీసిన గీతను ఎవరు జవదాటరు. ఈమె ప్రమోషన్స్ కు రాకపోయినా, షూటింగులకు ఎగ్గోటినా ఎదురు తిరిగేవారు ఉండరు. కారణం ఆమెకున్న స్టార్ డం. ముఖ్యంగా కోలీవుడ్‌లో ఈమె బొమ్మ పోస్టర్ పై కనిపిస్తే చాలు కలెక్షన్ల వర్షం కురుస్తుంది. ఈమె కోసం ప్రేక్షకులు థియేటర్ల వద్దకు క్యూ కడతారు. అంతటి పాపులారిటీ ఈమెకు సొంతం.

కాగా ఇటీవల ఈమె దర్శకుడు విగ్నేష్ శివన్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎప్పటినుండో సహజీవనం చేస్తున్న వీరు ఇటీవల పెళ్లి చేసుకున్నారు. ఇక విషయానికొస్తే తల‌ అజిత్ కుమార్ తునివు చిత్రం తర్వాత ఈమె భర్త విగ్నేశ శివ‌న్ తో ఓ చిత్రానికి ఓకే చెప్పారు. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో లైకా ప్రొడక్షన్స్ నిర్మించడానికి సిద్ధమైంది. భారీ బడ్జెట్ తో భారీ తారగాణంతో తెరకెక్కబోయే ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతారను ఎంపిక చేశారు. అజిత్ -నయనతార కాంబినేషన్‌లో ఇప్పటివరకు మూడు సినిమాలు వస్తే మూడు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. దీంతో మరోసారి ఫెయిర్ సక్సెస్ అవుతుందని అందరూ భావించారు. కానీ అజిత్ అనుకోకుండా తన తదుపరి ప్రాజెక్టును విగ్నేష్ శివన్ తో కాకుండా మరొకరితో చేస్తున్నారు. విగ్నేశ్ శివ‌న్ చెప్పిన కథను అజిత్ తిరస్కరించారని సమాచారం. దాంతో విగ్నేష్ శివ‌న్ కి తల అజిత్‌ను దర్శకత్వం వహించే సువర్ణావకాశం మిస్సయింది.

స్క్రిప్ట్ విషయంలో అభిప్రాయ భేదాల వల్లనే ఈ విధంగా జరిగింది. కానీ ఈ చిత్రం నుండి తన భర్తను తొలగించడం నయనతారకు అవమానంగా తోచింది. దాంతో ఈ చిత్రం నుంచి ఆమె కూడా తప్పుకుంటున్నట్టు చెప్పేసింది. దాంతో లైకా ప్రొడక్షన్స్ కు ఈమె షాక్ ఇచ్చింది. ఇక‌పై త‌ల అజిత్ తో చిత్రాలలో నటించకూడదని నిర్ణయం తీసుకొని కూడా మ‌రో షాక్ పై షాక్ ఇచ్చింది. తన భర్తని అవమానిస్తే తనని అవమానించినట్లేనని నయనతార లైకా ప్రొడక్షన్స్ కు అజిత్ కు ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చింది. మరి ఇందులో వాస్తవం ఎంతో తెలియాల్సి ఉంది.

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.