English | Telugu
యష్‌కి డైరక్టర్‌ని విశాల్ రికమండ్ చేశారా?
Updated : Feb 13, 2023
కన్నడ ఇండస్ట్రీలో ఇప్పుడు స్టార్ హీరోల్లో టాప్ పొజిషన్‌లో ఉన్నారు యష్. కేజీయఫ్ రెండు చాప్టర్లతో మన దేశంలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తెచ్చుకున్నారు యష్. దాదాపు ఎనిమిదేళ్లు కేజీయఫ్ గెటప్‌ని మెయింటెయిన్ చేశారు యష్. ఇప్పుడు కూడా అదే గెటప్‌ని కంటిన్యూ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యష్ నెక్స్ట్ సినిమా ఎవరితో అనే చర్చలు గట్టిగా జరుగుతున్నాయి.
నర్తన్ డైరక్షన్‌లో సినిమా ఉంటుందని అన్నారు. సలార్‌లో యష్ గెస్ట్ రోల్ చేస్తారని, డైరక్టర్ ప్రశాంత్ నీల్ యూనివర్శ్‌లో రాకీబాయ్‌కి స్పెషల్ ప్లేస్ ఉండటంతో, అలా డిజైన్ చేశారనీ వార్తలొచ్చాయి. అయితే ఈ విషయం మీద అఫిషియల్‌గా ఇంకా అనౌన్స్ మెంట్ రాలేదు.
తమ సంస్థకు సంబంధించి ఏ చిన్న న్యూస్ వైరల్ అయినా వెంటనే స్పందిస్తున్న హోంబలే సంస్థ సలార్‌లో యష్ నటిస్తున్నారనే మాటల మీద ఇప్పటిదాకా నోరు విప్పకపోవడంతో, ఆ వార్తలు నిజమేనంటున్నారు క్రిటిక్స్.సలార్ గెస్ట్ రోల్ సంగతి అటు ఉంచితే, యష్‌కి ఈ మధ్యనే ఓ స్టోరీని నెరేట్ చేశారట పి.యస్.మిత్రన్. సైబర్ క్రైమ్స్ ని, డీటైల్డ్ గా, పామరులకు కూడా అర్థమయ్యేలా నెరేట్ చేస్తారనే పేరుంది మిత్రన్‌కి. డైరక్టర్స్ లో మిత్రన్‌ది పెక్యులియర్ స్టైల్ అని అందరూ పొగుడుతూ ఉంటారు. రీసెంట్ టైమ్స్ లో యష్‌కి కూడా అలాంటి కథే చెప్పారట మిత్రన్. యష్‌కి మిత్రన్‌ని రికమండ్ చేసింది విశాలేననే న్యూస్ కూడా ఉంది.
మిత్రన్ చెప్పిన కథ విన్న యష్ ఇంకా పాజిటివ్‌గా స్పందించలేదట. ఆలోచించుకోవడానికి కాస్త టైమ్ అడిగారట యష్. ఆయన నెక్స్ట్ కేజీయఫ్3లో నటించాల్సి ఉంది. సో ఇదే గెటప్‌ని అప్పటిదాకా మెయింటెయిన్ చేయాలి. ఆ లెక్కన మిత్రన్ మూవీ ఒప్పుకున్నా, సేమ్ గెటప్‌లోనే ఉంటారా? లేకుంటే కొద్దిపాటి మార్పులతో నయా లుక్ ట్రై చేస్తారా? అనే ఇంట్రస్ట్ కూడా కనిపిస్తోంది. రీసెంట్‌గా ఈ ఫార్ములా రేస్‌కోసం హైదరాబాద్‌కి వచ్చారు యష్.