English | Telugu

‘దసరా’కి భారీ బడ్జెట్ వర్కౌట్ అవుతుందా!?

నాచురల్ స్టార్ నాని దసరా చిత్రంలో విభిన్నంగా కనిపిస్తున్నారు. మాసిన గడ్డం, చెదిరిన జుట్టు, లుంగీ మాసిపైన చొక్కాల తో ఫుల్ మాస్ అవ‌తార్‌లో అదిరిపోయేలా ఫోజిస్తున్నారు. ఈ సినిమా కూడా విభిన్నంగా తెరకెక్కుతుందని అంటున్నారు. కాగా దసరా చిత్రానికి కొత్త దర్శకుడైన శ్రీకాంత్ ఓదెలా దర్శకుడు. మునుపెన్నడూ లేని విధంగా కొత్త లుక్ లో నాని కనిపిస్తూ ఉండడంతో అభిమానులు కాస్త ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మార్చి 30వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. వాస్తవానికి టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలలో నాని ఒకరు.

ఆయన సినిమాలకు 30 కోట్లు పెడితే సేఫ్ బడ్జెట్. సినిమా మంచి టాక్ వస్తే 50 కోట్ల దాకా బిజినెస్ గ్యారెంటీ అయితే కొంతకాలంగా నాని నిలకడగా విజయాలు సాధించలేకపోతున్నారు. ఒకప్పుడు ఏకంగా ట్రిపుల్ హ్యాట్రిక్ మిస్సయిన ఈయన ఇప్పుడు వరుస విజయాలను అందించలేకపోతున్నారు. ఇటీవల విడుద‌లైన అంటే సుందరానికి చిత్రానికి కాస్త పాజిటివ్ టాక్ వచ్చిన కలెక్షన్లు లేకుండా పోయాయి. అయినా కూడా దసరా చిత్రానికి నిర్మాత సుధాకర్ చెరుకూరి 35 కోట్ల బడ్జెట్లో పెట్టడానికి రెడీ అయ్యార‌ని స‌మాచారం.

అయితే ఈ బడ్జెట్ విపరీతంగా పెరిగిందట. సరైన ప్రణాళిక ఏదీ లేకపోవడంతో బడ్జెట్ కొన్ని కోట్లు పెరిగిందని సమాచారం. శ్రీ‌కాంత్ ఓదెల ప్రణాళిక ప్రకారం సినిమాని తీయలేకపోయారా? లేదా క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని.... సినిమా పెద్ద రేంజ్‌కి వెళ్లే ఛాన్స్ ఉందని అదనంగా ఖర్చు పెట్టారా అనేది అర్థం కాని విషయం. బహుశా బిజినెస్ ఆఫర్లను చూసి టెంప్ట్ అయి ఉంటారని కొందరు అంటున్నారు. మొత్తానికి బడ్జెట్ అనుకున్న దానికంటే రెట్టింపు అయిందట. నాని ఒక్కడికే 15 కోట్ల దాకా రెమ్యూన‌రేష‌న్ ఇచ్చినట్లు సమాచారం. కీర్తి సురేష్ కూడా స్టార్ హీరోయిన్ కావడం.... పేరున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు పనిచేయడం.... వర్కింగ్ డేస్ బాగా పెరిగిపోవడంతో బడ్జెట్ భారీగా పెరిగిందని అంటున్నారు.

ఇకపోతే అన్ని హక్కులు కలుపుకొని ఈ చిత్రానికి 80 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. మొత్తానికి నానికి దసరా హిట్ అనేది కచ్చితంగా అత్యవసరం. ఏ మాత్రం తేడా వచ్చినా ఇబ్బందులు వస్తాయి. నాని తన స్టామినాను నిరూపించుకోవాలంటే దసరానే అత్యంత కీలకమని చెప్పాలి. ఈ చిత్రం ద్వారా ఆయ‌న తన పూర్వ వైభవాన్ని సాధిస్తాడా లేదా అనేది వేచి చేయాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .