English | Telugu

ధనుష్ 'సార్'పై ప్రశంసలు కురిపించిన భారతీరాజా!

కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ద్విభాషా చిత్రం సార్(వాతి). సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఇందులో ధనుష్ తో పాటు సముద్రఖని, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 17న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మెప్పు పొందుతోంది. తాజాగా ప్రముఖ దర్శకుడు భారతీరాజా సైతం ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు.

"నా సినీ జీవితంలో ఎన్నో మైలురాళ్లను చూశాను. కొన్ని విషయాలు నన్ను ఆశ్చర్యపరిచాయి. అలాంటి వాటిలో 'సార్' ఒకటి. నేను చాలా సినిమాలు చూస్తున్నాను, నేను ఇందులో భాగమైనందున ఇది ప్రత్యేకమైనది. సినిమాలు వినోదం పంచడం కంటే ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి. అలాంటి సినిమాల్లో వాతి ఒకటి. ఈ సినిమాలో విద్య యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పారు. సార్/వాతి అనేది గొప్ప టైటిల్, ఈ చిత్రం ఉపాధ్యాయుని సామాజిక బాధ్యత గురించి మాట్లాడుతుంది. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించే అవకాశం జివి ప్రకాష్ కి రావడం ఆయనకు ఆశీర్వాదం. ఈ ఏడాది ఆయన జాతీయ అవార్డు అందుకోవడం ఖాయం. ధనుష్, సముద్రఖని, సంయుక్త అద్భుతంగా నటించారు" అని భారతీరాజా చెప్పుకొచ్చారు.

ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడాలని భారతి రాజా ప్రజలను కోరారు. "నేను ఇప్పుడే సినిమా చూసి వచ్చాను. ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్న తీరు బాగుంది. ఇటీవల కాలంలో వచ్చిన అత్యుత్తమ చిత్రాలలో ఇదొకటి. ఇది థియేటర్‌లో తప్పక చూడవలసిన చిత్రం. మీరు ఈ సినిమాని థియేటర్లలో చూసి, ఆ అనుభూతిని నాతో పంచుకోవాలని కోరుకుంటున్నాను" భారతీరాజా అన్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .