English | Telugu

ల‌య కూతురు హీరోయిన్ల కంటే అదిరిపోతోంది!

ఒకప్పటి స్టార్ హీరోయిన్ లయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో సక్సెస్ ఫుల్ కెరీర్ ని కొన‌సాగించిన తెలుగు అమ్మాయిలలో ఒకరైన లయ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈమెకి ఎక్కువ‌గా యాత్, ఫ్యామిలీ ఆడియ‌న్స్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. నటిగా ఈమె కెరీర్ మంచి స్పీడ్ గా ఉన్న స‌మ‌యంలో పెళ్లి చేసుకుంది. కూచిపూడి డాన్సర్ అయిన లయ 'భద్రం కొడుకో' అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. స్వయంవరం మూవీతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రేమించు మూవీ లయకు మంచి గుర్తింపు తెచ్చింది. నంది అవార్డు కూడా తెచ్చి పెట్టింది. త‌న కెరీర్ లో ఈమె ఎక్కువ‌గా జ‌గ‌ప‌తిబాబు, శ్రీ‌కాంత్, రాజ‌శేఖర్, వేణు వంటి హీరోల‌తో క‌లిసి న‌టించింది. ఇక ఈమె న‌టించిన బిగ్ స్టార్ ఎవ‌ర‌య్యా అంటే బాల‌కృష్ణ అని చెప్పాలి. బాల‌య్య న‌టించిన విజ‌యేంద్ర‌వ‌ర్మ మూవీలో ఈమె న‌టించింది.
కె.విశ్వనాథ్ ద‌ర్శ‌క‌త్వంలో స్వ‌రాభిషేకం, పెద్ద వంశీతో దొంగ‌రాముడు అండ్ పార్టీ వంటి సినిమాలు చేసింది. మిస్సమ్మ సినిమాలో లయ పాత్ర సాధారణ మధ్యతరగతి గృహిణిగా ఆకట్టుకుంది. భూమికకు ఎంత పేరు వచ్చిందో లయకు అంత గుర్తింపు వచ్చింది. తెలుగుతోపాటు తమిళం మలయాళం లో కూడా నటించిన ఆమె చివరిగా తెలుగులో బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం అనే సినిమా చేసి యూఎస్ఏ లో సెటిల్ అయిపోయింది.

కొన్నేళ్ళ విరామం తర్వాత తెలుగులో 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాలో ల‌య నటించింది. ఆ సినిమాలో చైల్డ్ యాక్టర్ గా ల‌య కూతురు నటించింది. ఈమె పేరు శ్లోక. ఈమధ్య తల్లి కూతుర్లు ఎక్కువగా షార్ట్ వీడియోలలో డాన్స్ లతో సందడి చేస్తున్నారు. లయ కూతురు కూడా లచ్చం లయ పోలికలతోనే ఉండడంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందేమో అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. లయ కూడా 40 ఏళ్లు దాటినా కూడా అందంలో కూతురితో పోటీపడుతోందని ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు. తాజాగా ల‌య త‌న ఫ్యామిలీకి చెందిన ఓ బ్యూటిఫుల్ పిక్ ను షేర్ చేశారు. దీంతో వీరు తల్లి కూతురులా కాకుండా అక్క చెల్లెలు లా ఉన్నారని కామెంట్ చేస్తున్నారు. అందుకే శ్లోకాని హీరోయిన్ గా పరిచయం చేసే టైం వచ్చేసిందని సూచిస్తున్నారు.