English | Telugu

దిల్ రాజు వర్సెస్ నిఖిల్.. మళ్ళీ 'కార్తికేయ-2' సీన్ రిపీట్!

ఈమధ్య రిలీజుల విషయంలో నిర్మాతలు ఒకరికి ఒకరు సహకరించుకుంటున్నారు. ఒకే తేదీకి రెండు సినిమాలు విడుదలకు సిద్ధమైతే ఒక నిర్మాత కోసం మరో నిర్మాత తమ సినిమాని ఒక రోజు ఆలస్యంగా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. దీంతో నిర్మాతలతో పాటు సినిమాలకు కూడా మంచి జరుగుతుంది. ఇంకా వచ్చే నెల ఇదే తరహాలో రెండు సినిమాలు పోటీ పడుతున్నాయని సమాచారం. ఏప్రిల్ 14న సమంత నటించిన శాకుంతలం, నిఖిల్ హీరోగా నటిస్తున్న స్పై విడుదల కానున్నాయి. ఈ రెండూ కూడా పాన్ ఇండియా సినిమాలు కావడం విశేషం.

గత ఏడాది నిఖిల్ నటించిన కార్తికేయ2 పాన్ ఇండియా హిట్టుని సొంతం చేసుకుంది. ఇటీవల 18 పేజెస్ సినిమాతో కూడా అలరించారు. తాజాగా స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీగా స్పై సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదలయ్యే అవకాశముంది. అదే సమయంలో సమంత హీరోయిన్ గా గుణశేఖర్ డైరెక్షన్ లో రూపొందిన శాకుంతల ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీగా ఉంది. దిల్ రాజు శాకుంత‌లం చిత్రాన్ని భారీ స్థాయిలో విడుద‌ల చేయనున్నారు.

కార్తికేయ 2 విష‌యంలో రిలీజ్ డేట్ వ‌ద్ద ఇబ్బందులు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు త‌మ థ్యాంక్యూ చిత్రం కోసం కార్తికేయ 2 రిలీజ్ డేట్ మార్చుకునేలా చేశారని నాడు అంద‌రు కోడై కూశారు. నిఖిల్ మీడియా ముందు కంట‌త‌డి పెట్టుకున్నారు. ఇలా ఒకే తేదీన విడుద‌ల కాకుండా సినిమా డేట్ మార్చుకోవ‌డం వివాదంగా మారింది. ఈ కారణంగానే కార్తికేయ2 రిలీజ్ ని వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని నిఖిల్ ఇండైరెక్టుగా వెల్లడించడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ప్ర‌స్తుతం కూడా మ‌ర‌లా అలాంటి సీనే రిపీట్ అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈసారి దిల్ రాజు ముందు జాగ్ర‌త్త ప‌డ్డారు. త‌న శాకుంత‌లం రిలీజ్ డేట్‌ని స్పై కంటే ముందే ప్ర‌క‌టించారు.. కానీ స్పై విష‌యంలో ఆల‌స్యం జ‌రుగుతోంది.

ఇక శాకుంత‌లంతో పాటు స్పై చిత్రం ఓకే డేట్ ని ప్ర‌క‌టిస్తే ఈసారి కూడా నిఖిల్‌కి గ‌డ్డు ప‌రిస్థితులు ఖాయం. ఇదే తరహాలో పరిస్థితి పునరావృతమయ్యేలా కనిపిస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సమంత శాకుంత‌లం రిలీజ్ డేట్ ను ఇప్పటికే ప్రకటించేశారు. నిఖిల్ స్పై రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఒకవేళ ఈ మూవీ ని కూడా ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నామని ప్రకటిస్తే కనుక మళ్ళీ కార్తికేయ2 తరహాలో రిలీజ్ డేట్ ని మార్చుకోక తప్పేలా కనిపించడం లేదని ఇన్సైడ్ ఇటాక్. నిఖిల్ నటించిన స్పై మూవీ ని పాన్ ఇండియా సినిమా గా ఐదు భాషల్లో భారీగా రిలీజ్ చేయబోతున్నారు. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .