English | Telugu

ఓటీటీలోకి 'అమిగోస్'.. ఎప్ప‌టి నుంచో తెలుసా?

నందమూరి కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసిన 'అమిగోస్' చిత్రం ఈనెల 10వ తేదీన విడుద‌లైన సంగతి తెలిసిందే. ఒకే పోలికతో ఉన్న ముగ్గురు వ్యక్తుల కథతో ఈ చిత్రం తెరకెక్కింది. దర్శకుడు రాజేందర్ రెడ్డి ప్రయోగం వికటించింది. డిజిటల్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 10 కోట్లు వెచ్చించి ఈ హక్కులను దక్కించుకున్నారు. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. త్వరలోనే ఈ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతున్నట్టు సమాచారం. వచ్చే నెల అంటే మార్చి మొదటి వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. సౌత్ లాంగ్వేజ్ తో పాటు హిందీ భాషలో కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోందట.

మొదట థియేటర్లలో రిలీజ్ అయిన 50 రోజుల తర్వాతే ఓటిటిలో విడుదల చేయాలనుకున్నా.. థియేటర్లలో ఈ సినిమా పెద్దగా ఆడకపోవడంతో మూడు వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారట. 'అమిగోస్' ఓటీటీ రిలీజ్ డేట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ కచ్చితంగా మార్చి మొదటి వారంలోనే స్ట్రీమింగ్ అవుతుందని టాలీవుడ్ న్యూస్.

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించింది. సినిమా తీసిన విధానం ఆసక్తికరంగా లేకపోవడం వలన సినిమా ప‌రాజ‌యం పాలయింది. ఇందులో బాలయ్య బాబు దివ్య భారతి పై తెరకెక్కించిన 'ఎన్నో రాత్రులు వస్తాయి గాని' పాటను రీమిక్స్ చేశారు. అయినా ఫ‌లితంలో ఎలాంటి మార్పు లేదు. మొత్తానికి అమిగోస్ చిత్రం అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.