English | Telugu

అరుదైన రికార్డ్ దిశ‌గా దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుడు!

దర్శక దిగ్గజం, దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ప్రస్తుతం ఇండియన్ 2, ఆర్ సి 15 చిత్రాలు రూపొందుతున్నాయి. ఈ రెండు చిత్రాలను ఒకేసారి సైమల్టేనియస్ గా శంకర్ పూర్తి చేస్తున్నారు. ఒక వారం ఇండియన్2 చిత్రం చేస్తే మరుసటి వారం ఆర్ సి 15 చిత్రం చేస్తున్నారు. గతంలో దాసరి లాంటి దర్శకులు ఇలా ఒకే సమయంలో రెండు మూడు చిత్రాలు చేసేవారు. ఒకే రోజులో రెండు మూడు షిఫ్ట్ లో రెండు మూడు సినిమాలు షూటింగులు పూర్తి చేసిన సందర్భాలు ఉన్నాయి.

కానీ ఆ తర్వాతి కాలంలో మాత్రం ఎవ్వరు ఇలాంటి రిస్క్ చేయలేదు. ఒక సినిమా పూర్తయిన తర్వాతనే మరో సినిమా అనుకుంటూ వస్తున్నారు. కానీ అనుకోకుండా శంకర్‌కు ఇండియన్ 2, ఆర్ సి 15లు ఒకేసారి పూర్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇండియన్ 2 ఆగిపోయిన సమయంలో ఆయన ఆర్ సి 15 చిత్రాన్ని లైన్ లోకి తెచ్చారు. అంతలోపే ఇండియన్ 2 ప్రారంభం కావాల్సి వచ్చింది. దాంతో ఆయనకు ఒకేసారి రెండు చిత్రాలను బ్యాలెన్స్ చేయడం తప్పనిసరి అయింది.

మొద‌టి నుంచి శంక‌ర్ త‌న చిత్రాల‌కు ఎక్కువ స‌మయం తీసుకుంటాడ‌నే పేరుంది. ఒక్క చిత్రానికే ఆయ‌న రికార్డు స్థాయిలో స‌మ‌యం తీసుకుంటారు. ఒక సినిమా త‌రువాతే మ‌రో సినిమా. దాదాపు ఈయ‌న‌ది ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళిది ఒకే స్థాయి.ఈ రెండు చిత్రాలను ఏమాత్రం కన్ఫ్యూషన్ లేకుండా శంకర్ పూర్తి చేస్తున్నాడని సమాచారం. ఈ రెండు చిత్రాలు గనక హిట్ అయితే ఇటీవల కాలంలో ఒకేసారి రెండు భారీ చిత్రాలను తెరకెక్కించి రెండింటిని హిట్లుగా నిలిపిన ఘనతను శంకర్ సాధిస్తారు.

అదే ఏమైనా తేడా జరిగి రెండు చిత్రాల ఫలితాలలో తేడా వస్తే ఒకేసారి రెండు సినిమాలను తెరకెక్కించి రెండు పాన్ ఇండియా చిత్రాలను డిజాస్టర్ గా నిలిపిన దర్శకునిగా శంకర్ పేరు నిలబడుతుంది. ఏది ఏమైనా ఒక చిత్రం హిట్ అయితే కాస్త సేఫ్ అవుతారు. అయినా ప్రస్తుతానికి ఆయన క‌సితో రెండు చిత్రాలను ఎలాగైనా హిట్ బాట ప‌ట్టించాల‌ని చూస్తున్నారు. మరి ఈ ప్రయత్నం ఎంతవరకు సఫలం అవుతుందో వేచి చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.