English | Telugu
అజిత్ ఫ్యాన్స్ కి గుడ్‌న్యూస్!
Updated : Feb 20, 2023
అజిత్ ఫ్యాన్స్ కి ఇది నిజంగానే గుడ్ న్యూసే! మార్చి మొదటి వారంలో అజిత్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. మగిళ్ తిరుమేని ప్రీ ప్రొడక్షన్ పనులను అంతలోపే కంప్లీట్ చేస్తానని మాటిచ్చేశారట. జూన్ ఎండింగ్, జులై ఫస్ట్ వీక్‌కి షూటింగ్ పార్టు కంప్లీట్ చేసేయవచ్చని పేపర్ మీద లెక్కలు కూడా వేసి చూపించారట. తక్కువ లొకేషన్లలో, యాక్షన్ ప్యాక్డ్ మూవీగా ప్లాన్ చేస్తున్నారట మగిళ్ తిరుమేని. జులైకి షూటింగ్ పూర్తయితే, నిరభ్యంతరంగా దీపావళి రేసులో అజిత్ మూవీని నిలబెట్టాలన్నది ప్లాన్. హీరోయిన్‌గా మంజు వారియర్ పేరు వినిపిస్తోంది. అన్నీ ఫైనలైజ్ అవ్వగానే ప్రకటించాలన్నది మేకర్స్ ప్లాన్.
లాస్ట్ మంత్ 11న విడుదలైంది అజిత్ తునివు. అదే తేదీన ప్రేక్షకులను పలకరించారు దళపతి విజయ్. ఆ సినిమా విడుదల కావడం, ఆ వెంటనే లోకేష్ కనగరాజ్ సినిమాను ప్రారంభించడం కూడా పూర్తయింది. ఇప్పుడు కాశ్మీర్‌లో షూటింగ్‌లో ఉంది విజయ్ - లోకేష్ టీమ్. అక్టోబర్ 19న సినిమాను విడుదల చేస్తామని జబర్దస్త్ గా అనౌన్స్ చేసేశారు లోకేష్. తునివు విడుదల కాగానే ఫారిన్ ట్రిప్‌కి వెళ్లారు అజిత్. ఆయన ఫ్యామిలీతో గడిపిన ఫొటోలు వైరల్ అయ్యాయి. అజిత్ సతీమణి షాలిని కూడా కొన్ని ఫొటోలను షేర్ చేశారు. ఇటీవలే ట్రిప్ నుంచి తిరిగి వచ్చారు అజిత్. ఆ వెంటనే మగిళ్ తిరుమేనితో మీటింగ్ పెట్టి మార్చి నుంచి జులై వరకు టైమ్ స్పెండ్ చేస్తానని చెప్పేశారట.
ఈ సినిమా రిలీజ్ కాగానే, ఏడాది పాటు కెరీర్‌లో బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నారట అజిత్. తన బైక్ మీద ప్రపంచ పర్యటన చేయాలన్నది ఆయన సంకల్పం. ఈ ట్రిప్‌లో అజిత్‌కి మంజువారియర్ కంపెనీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారట. మంజు వారియర్ చాలా బాగా బైక్ డ్రైవ్ చేస్తారు. రీసెంట్‌గా బీఎండబ్ల్యూ బైక్ తీసుకున్నారు. ఈ సందర్భంగా తనకు ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిన అజిత్‌కి కూడా థాంక్స్ చెప్పారు. వార్తల్లో ఉన్నట్టు అజిత్ నెక్స్ట్ సినిమాలో మంజు వారియర్ హీరోయిన్ అయితే, ఆ సినిమాను కంప్లీట్ చేయగానే ఇద్దరూ ట్రిప్‌కి వెళ్లడం ఖాయం అన్నమాట.