English | Telugu
శివాజీగా నటించాలనే నా కల నెరవేరిందంటున్న శరద్
Updated : Feb 20, 2023
బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుంది శరద్ కేల్కర్‌కి. సమయం వచ్చినప్పుడల్లా అతను శివాజీ గురించి మాట్లాడుతూనే ఉంటారు. తన జీవితంలో శివాజీ ఎలా ప్రభావం చూపించారనే విషయం గురించి చెబుతూ ఉంటారు. శివాజీ జయంతి సందర్భంగా శరద్ మాట్లాడుతూ ``నా చిన్నతనం నుంచి శివాజీ మహరాజ్ నాలో స్ఫూర్తినింపుతూనే ఉన్నారు. ఆయన జీవితం, ఆయన పోరాటం నాలో తెలియని జ్వాల రగులు స్తూనే ఉండేవి. అలాంటి గొప్ప వ్యక్తి పుట్టి పెరిగిన గడ్డ మీద నేను కూడా పెరిగినందుకు చాలా ఆనందంగా అనిపించింది. ఒకరకమైన గర్వంగా అనిపించేది`` అని అన్నారు.
తానాజీలో శివాజీ కేరక్టర్‌లో కనిపించారు శరద్. ఆ విషయం గురించి మాట్లాడుతూ ``తానాజీలో శివాజీ మహరాజ్ పాత్ర పోషించడం నా పూర్వజన్మ సుకృతం. సిల్వర్‌స్క్రీన్ మీద ఆయన కేరక్టర్‌లో కనిపించడం అదృష్టంగా భావిస్తున్నా. ఆయన నాయకత్వాన్ని, ధైర్యాన్ని చూసి మనం చాలా నేర్చుకోవాలి. తన ప్రజలను ఆయన పాలించిన విధానం స్ఫూర్తిదాయకం. మన జీవితాల్లోనూ శివాజీని అనుసరించాల్సిన క్షణాలు బోలెడన్ని ఉంటాయి. అలాంటి సందర్భాల్లో ఆయన్ని తలచుకోవడం ఉత్తమం`` అని అన్నారు.
మార్వెల్స్ వేస్ట్ ల్యాండర్స్ లో ఓ పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు శరద్ కేల్కర్. రాజ్‌కుమార్ రావుతో కలిసి శ్రీ లో నటిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సస్పెన్స్ థ్రిల్లర్ చోర్ నిఖాల్ కే భాగాలోనూ కీ రోల్ చేస్తున్నారు. రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న వెబ్ సీరీస్‌లో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు శరద్ కేల్కర్.