English | Telugu
దిల్ రాజు బ్యానర్‌లో సుహాస్ హీరోగా మూవీ!
Updated : Feb 21, 2023
కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ సినిమాలతో సుహాస్ ఆకట్టుకున్నారు. ఈ యంగ్ టాలెంటెడ్ యాక్టర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ని స్టార్ట్ చేసి హీరోగా టర్న్ అయ్యారు. రెండు హిట్స్ తో మంచి జోరు మీద ఉన్నారు. చిన్న సినిమాలతో మంచి ఇంట్రెస్టింగ్ కథలతో వస్తున్నారు. తాజాగా ఆయనకు భారీ నిర్మాణ సంస్థల నుంచి అవకాశాలు వస్తున్నాయి. దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి ఒక అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. దిల్ రాజ్ చిన్న సినిమా, చిన్న హీరోలు, కొత్త, టాలెంటెడ్ దర్శకులతో చిత్రాలు తీయడానికి శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ సంస్థతో పాటు మరో ప్రొడక్షన్ స్థాపించారు. ప్రొడక్షన్ హౌస్ లో 5 కోట్ల కంటే తక్కువ బడ్జెట్ చిత్రాలను రూపొందిస్తున్నారు. కొత్త దర్శకులను చిన్న దర్శకులను పరిచయం చేయనున్నారు.
మొదటి చిత్రం గా కమెడియన్ వేణు దర్శకత్వంలో బలగం అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. పాటలు ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ బ్యానర్ సుహాస్ హీరోగా ఓ సినిమాని నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. దీని ద్వారా మరో కొత్త దర్శకుడు పరిచయం కానున్నారు. ఇక సుహాస్ కు గీత ఆర్ట్స్2 లో కూడా అవకాశం వచ్చిందని సమాచారం. గీతాఆర్ట్స్ 2 బేనర్ లోకూడా తక్కువ బడ్జెట్ సినిమాలు వస్తాయి. వాటిలో భాగంగా ఇప్పుడు సుహాస్ హీరోగా ఓ కొత్తసినిమా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.