English | Telugu
‘SSMB 29’లో దీపికా పడుకొనే నటించడం లేదట!
Updated : Feb 21, 2023
దీపికా పడుకొనే -రణబీర్ సింగ్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసింది. పెళ్లినాటి నుండి వృత్తిపరంగానే వీరు బిజీగా ఉన్నారు. పిల్లలు భవిష్యత్తు ప్లానింగ్ వంటి వాటికీ దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో పిల్లల విషయంలో ఇద్దరిపై కొంత నెగిటివ్ స్ప్రెడ్ అయింది. కావాలని పిల్లలు వద్దనుకుంటున్నారని ఈ విషయంపై ఇరు కుటుంబాల మధ్య చిన్నపాటి వివాదాలు మొదలైనట్టు ఏడాది కిందట వార్తలు వైరల్ అయ్యాయి అయితే వాటిని నాడు దీపికా గాని రణవీరుని ఖండించలేదు. తాజాగా మరోసారి కుటుంబ సభ్యుల్లో వాడి వేడి చర్చకు రావడంతో దంపతులిద్దరూ పిల్లల విషయంలో నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం దీపిక చేతిలో ఉన్న సినిమాలన్నింటినీ పూర్తిచేసి రెండేళ్ల పాటు విరామం తీసుకోవాలనుకుంటుంన్నారట. ఈ విరామం కేవలం పిల్లల కోసమేనని బాలీవుడ్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. దీపిక నిర్ణయాన్ని రణబీర్ గౌరవించి అన్ని రకాల స్వేచ్ఛను కల్పిస్తున్నారట ఈ నేపథ్యంలో దీపిక రణబీర్ కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలని అందుకోసం ముంబైని వీడాలని నిర్ణయించుకున్నారట. కొన్నాళ్లపాటు ఢిల్లీలో ప్రత్యేకంగా ఓ లగ్జరీ ప్లాట్ అద్దెకు తీసుకొని అక్కడ ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం దీపిక ఫైటర్ సినిమాలో నటిస్తోంది. ప్రభాస్ సరసన ప్రాజెక్ట్ కె చిత్రంలో నటిస్తోంది.
దీపిక 2024 నుంచి విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. దీన్ని బట్టి దీపికా పడుకొనే మహేష్ రాజమౌళి గా చిత్రంలో నటిస్తుంది అనే విషయం నిజం కాదని అర్థమవుతుంది. ఆమె మహేష్- రాజమౌళి లో కాంబోలో రూపొందే చిత్రంలో నటించడం లేదని క్లారిటీ వస్తుంది. మరి ఈ విషయమై మేకర్స్ నుండి దీపికా నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచిచూడాలి.