English | Telugu
పవన్ కళ్యాణ్‌పై గురూజీ ప్రభావం వుండదు!
Updated : Feb 20, 2023
టాలీవుడ్ దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కు ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ తొలిసారిగా 2008లో జల్సా చిత్రంతో పనిచేశారు. ఆ తరువాత అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి వంటి చిత్రాలకు కూడా పనికి పనిచేశారు. వీరిద్దరి స్నేహబంధం ఎంతగా పెనవేసుకుని ఉందంటే జనసేన పార్టీ స్థాపించిన పవన్ కోసం త్రివిక్రమ్ స్పీచ్ లు రాసేంతగా సహితమైపోయారు. ఇక పవన్ చిత్రాల విషయంలో కూడా త్రివిక్రమ్ వేలు పెడతాడని అందువల్లే పవన్ ఏ సినిమాలంటే ఆ సినిమాలు ఒప్పుకుంటున్నాడని విమర్శించే వాళ్ళు ఉన్నారు.
కేవలం త్రివిక్రమ్ వల్లనే పవన్ వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వంటి చిత్రాలను చేశాడని అలాంటి రీమేక్ చిత్రాలు చేయడానికి త్రివిక్రమ్ ఇచ్చిన సలహాలే కారణమని అభిమానులు మండిపడుతుంటారు. ఇక తేరీ రీమేక్, వినోదాయసిత్తం రీమేక్ లు సైతం పవన్ ఒప్పుకోవడానికి కారణం త్రివిక్రమ్ ప్రభవమే కారణమని భావిస్తారు. తాజాగా ఈ విషయమై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఇటీవల స్పందించారు. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ మంచి స్నేహితులు. ఎప్పుడు సమయం దొరికినా టైం స్పెండ్ చేస్తారు. ఒకరి సినిమాలలో మరోకరి ప్రమేయం ఉండదు. కేవలం వారు చేస్తున్న సినిమాల గురించి మాట్లాడుకుంటారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలపై త్రివిక్రమ్ ప్రభావం అసలు ఉండదు అని పేర్కొన్నాడు, మరి సూర్యదేవర నాగవంశీ క్లారిటీతోనైనా పవన్ పై త్రివిక్రమ్ ప్రభావం ఉందనే మాటలకు... వార్తలకు... ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.