English | Telugu

వేరేవాళ్లు ఎదవలనా.. వేలు పెడతాం.. పూలు వేయించుకుంటాం.. రాళ్ళూ కొట్టించుకుంటాం

"రంగబలి" మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా నాగశౌర్య నిఖిల్ తో నాటకాలు షోలో పాడ్కాస్ట్ ని స్టార్ట్ చేసి ఇండస్ట్రీకి సంబంధించి ఎన్నో విషయాలను చెప్పారు. "ఏ అవార్డు ఫంక్షన్ కి వెళ్లవు...ఫిలిం ఫేర్, సైమా వంటి ఏ అవార్డ్స్ నువ్వు తీసుకోవు...చాలా మంది హీరోస్ అవార్డ్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ అవార్డ్స్ నిజమేనా" అని నిఖిల్ అడిగేసరికి "అబద్దం అని చెప్పడానికి నా దగ్గర ఏ ప్రూఫ్ లేదు. అవార్డు అనేది జెలస్ ఫీల్ తెప్పించేది. థి బెస్ట్ యాక్టర్ అంటూ కొంతమందికి అవార్డు ఇస్తే వేరేవాళ్లు ఎదవలనా..కాదు కదా. ఆ మూవీ తీసిన డైరెక్టర్ కి అవార్డు ఇవ్వాలి అంటున్నా..