English | Telugu
సూర్య వెనకబడటానికి కారణమేంటి?
Updated : Jul 6, 2023
విజయ్, అజిత్‌తో పోలిస్తే సూర్య వెనకబడ్డారా? అసలు అలా వెనకబడటానికి కారణం ఏంటి? అని అడిగితే ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు నిర్మాత ధనుంజయన్. ముగమూడి, అంజాన్, ఇరుది సుట్రు, దైవ తిరుమగళ్ వంటి సినిమాలను నిర్మించారు ధనంజయన్. తమిళ్, తెలుగు, మలయాళం, హిందీలో ఆయన సినిమాలు విడుదలయ్యాయి.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన కొన్ని విషయాలను పంచుకున్నారు. "విజయ్‌కీ, అజిత్‌కి పోటీ ఇప్పుడు మొదలైంది కాదు. వాళ్లిద్దరి మధ్య 2002 నుంచి ఈ పోటీ ఉంది. గిల్లి, తిరుమలై, వరలారు సినిమాల టైమ్ నుంచే ఆ పోటీ ఉంది. దానికి తగ్గట్టే ఇద్దరి కెరీర్లలో మంచి హిట్స్ ఉన్నాయి. అయితే సూర్యకి అప్పుడు సరైన సినిమాలు పడలేదు. దాదాపు ఐదేళ్ల తర్వాత ఆయనకు కాక్క కాక్క హిట్ అయింది. ఆ తర్వాత ఐదేళ్లకి సింగం పెద్ద హిట్ అయింది. అప్పటికే అటు విజయ్, ఇటు అజిత్ ఇద్దరూ టాప్ చెయిర్లలో కూర్చున్నారు. విజయ్, అజిత్‌కి నాన్‌స్టాప్‌గా హిట్స్ వచ్చిన రోజుల్లోనే సూర్యకి సింగం వచ్చి ఉంటే, ముగ్గురి మధ్య టఫ్ ఫైట్ కనిపించేది. అది జరగలేదు కాబట్టే ఇప్పుడు సూర్య మూడో స్థానంలో ఉన్నారు. వాళ్లను దాటలేకపోతున్నారు.
జై భీమ్ తర్వాత సూర్య డిజిటల్ మార్కెట్ కూడా చాలా పెరిగింది. పక్కా థియేట్రికల్ హిట్ పడి చాన్నాళ్లయింది. కంగువ తప్పకుండా వేరే రేంజ్ సినిమా. సూర్య మార్కెట్‌ని ష్యూర్‌గా పెంచుతుంది" అని అన్నారు.
ధనుంజయన్ చెప్పిన మాటలు సూర్య ఫ్యాన్స్ లో ఎక్స్ పెక్టేషన్స్ పెంచేస్తున్నాయి. కొంతమంది ఆయన మాటలతో ఏకీభవిస్తున్నారు. 2003లో కాక్క కాక్క, 2013 సింగం2 చేశారని.. ఆ మధ్య కాలంలో సూర్యకి అన్నీ హిట్స్ పడ్డాయని అన్నారు. 2009లో అయాన్, 2011లో ఏళామ్ అరివు, 2013లో వచ్చిన సింగం2 టాప్ గ్రాసర్స్ అని కూడా పోస్టులు పెడుతున్నారు.
2016, 2017లో రెండు వంద కోట్ల సినిమాలను సూర్య ఇచ్చారు. అయినా, ఇప్పుడు ఓ థియేట్రికల్ బ్లాక్ బస్టర్ సినిమాను ఇవ్వాల్సిన కంపల్సరీ సిట్చువేషన్‌లో ఉన్నారు.