English | Telugu
మెగా 'కోల్ కతా' సెంటిమెంట్ .. 'భోళా శంకర్' రిపీట్ చేస్తాడా?
Updated : Jul 5, 2023
సంక్రాంతికి సందడి చేసిన 'వాల్తేరు వీరయ్య'తో కెరీర్ బెస్ట్ గ్రాసర్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. కట్ చేస్తే.. త్వరలో 'భోళా శంకర్'గా ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నారాయన. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఆగస్టు 11న థియేటర్స్ లోకి వస్తోంది. కోల్ కతా నేపథ్యంలో తెరకెక్కుతున్న 'భోళా శంకర్'కి .. తమిళం లో విజయం సాధించిన అజిత్ 'వేదాళం' ఆధారం.
ఇదిలా ఉంటే.. గతంలో కోల్ కతా బ్యాక్ డ్రాప్ తో వచ్చిన కొన్ని మెగా కాంపౌండ్ మూవీస్ బాక్సాఫీస్ ముంగిట సెన్సేషన్ క్రియేట్ చేశాయి. 1998లో వచ్చిన చిరంజీవి 'చూడాలని ఉంది' కోల్ కతా నేపథ్యం లో తెరకెక్కితే.. 2001లో రిలీజ్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఖుషి'లోనూ కోల్ కతా బ్యాక్ డ్రాప్ ఉంది. ఇక 2013 సంక్రాంతికి ఎంటర్టైన్ చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'నాయక్'లో కూడా కోల్ కతా నేపథ్యం ఉంది. మరి.. ముచ్చటగా మూడు సార్లు మెగా కాంపౌండ్ కి అచ్చివచ్చిన 'కోల్ కతా' సెంటిమెంట్.. 'భోళా శంకర్' విషయంలోనూ రిపీట్ అయ్యి కాసుల వర్షం కురుస్తుందేమో చూడాలి.
కాగా 'భోళా శంకర్'లో చిరంజీవి సరసన తమన్నా నాయికగా నటిస్తుండగా, చిరుకి చెల్లిగా కీర్తి సురేష్ దర్శనమివ్వనుంది. మహతి స్వర సాగర్ బాణీలు అందిస్తున్నాడు.