సుధాకర్ కి మంచి బ్రేక్ ఇచ్చే సినిమా 'నారాయణ అండ్ కో'!
యంగ్ హీరో సుధాకర్ కోమాకుల నటించిన హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'నారాయణ అండ్ కో'. చిన్నా పాపిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్, సుఖ మీడియా బ్యానర్‌ల పై పాపిశెట్టి బ్రదర్స్ తో కలిసి సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం జూన్ 30న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ వేడుకలో దర్శకులు అనిల్ రావిపూడి, విజయ్ కనకమేడల, హీరో తిరువీర్, నిర్మాత రాజ్ కందుకూరి, ఆర్పీ పట్నాయక్ అతిథులుగా పాల్గొన్నారు.