English | Telugu
వంద కోట్ల సినిమాలో కృతిశెట్టి!
Updated : Jul 5, 2023
ఉప్పెన లేడీకి సినిమాలు కలిసి రావడం లేదు. వరుసగా ఫ్లాపులే పలకరిస్తున్నాయి అంటూ ఈ మధ్యకాలంలో ఏవేవో వార్తలు వినిపిస్తున్నాయి. వాటిని పట్టించుకునే తీరిక నాకు లేదు, నా వంద కోట్ల సినిమా షూటింగ్ మొదలైంది. నేను ఫుల్ బిజీ అన్నట్టుగా ఉంది బేబమ్మ వ్యవహారం. ఇంతకీ కృతి శెట్టి నటిస్తున్న వంద కోట్ల మూవీ మాటేంటి? తమిళ్‌లో జయం రవి నటిస్తున్న సినిమా జెనీ. గతంలో మిస్కిన్ దగ్గర పనిచేసిన భువనేష్ అర్జునన్, ఈ సినిమాను డైరక్ట్ చేస్తున్నారు. ఇషారి కె గణేష్ నిరర్మాత. ఈ సినిమాకు జెనీ అనే టైటిల్ పెట్టినప్పటి నుంచి మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. జయం రవి నటిస్తున్న 32వ సినిమా ఇది. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. కల్యాణి ప్రియదర్శన్ మరో నాయిక. బాలీవుడ్ నటీనటులు కూడా పలువురు నటించనున్నారు.ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది.
జులై 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.
జయం రవి ఆల్రెడీ క్లౌడ్ నైన్‌లో ఉన్నారు. మణిరత్నం డైరక్షన్‌లో ఆయన టైటిల్ రోల్ చేసిన పొన్నియిన్ సెల్వన్ రెండు పార్టులకూ మంచి స్పందన వచ్చింది. పొన్నియిన్ సెల్వన్ కేరక్టర్‌కి జయం రవి అద్భుతంగా న్యాయం చేశారని అందరూ మెచ్చుకున్నారు. అదే జోష్‌లో చేతిలో ఉన్న సినిమాలను కంప్లీట్ చేస్తున్నారు ఈ హీరో. ఆయన ప్రస్తుతం ఇరైవన్, సైరన్ సినిమాల్లో నటిస్తున్నారు. త్వరలోనే సైరన్ సినిమా థియేటర్లలోకి రానుంది.