English | Telugu
మళ్ళీ యాక్షన్ లోకి దిగుతున్న నందమూరి హీరో!
Updated : Jul 5, 2023
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం 'డెవిల్' అనే ఫిల్మ్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్ పుట్టినరోజు(జూలై 5) సందర్భంగా ఈరోజు ఆ మూవీ నుంచి గ్లింప్స్ విడుదలై ఆకట్టుకుంది. దీంతో పాటు మరో బర్త్ డే సర్ ప్రైజ్ కూడా ఇచ్చారు కళ్యాణ్ రామ్. ఆయన హీరోగా రూపొందనున్న 21వ సినిమా అప్డేట్ వచ్చింది. ఈ సినిమాతో ఆయన మళ్ళీ యాక్షన్ లోకి దిగుతున్నారు.
విభిన్న జోనర్లలో సినిమాలు చేస్తూ సినిమా సినిమాకి వైవిధ్యం చూపిస్తుంటారు కళ్యాణ్ రామ్. గతేడాది 'బింబిసార' అనే ఫాంటసీ ఫిల్మ్ చేసిన ఆయన, ఈ ఏడాది 'అమిగోస్' అనే థ్రిల్లర్ చేశారు. అలాగే ఇప్పుడు 'డెవిల్' అనే పీరియాడిక్ ఫిల్మ్ చేస్తున్న ఆయన, నెక్స్ట్ యాక్షన్ లోకి దిగబోతున్నారు. తాజాగా కళ్యాణ్ రామ్ 21వ సినిమా ప్రకటన వచ్చింది. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించనున్నారు. ఈయన గతంలో నారా రోహిత్, నందమూరి తారకరత్న నటించిన 'రాజా చెయ్యివేస్తే' సినిమాని డైరెక్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ నందమూరి హీరోతోనే సినిమా చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ కెరీర్ లో యాక్షన్ జోనర్ లో 'అతనొక్కడే' వంటి బిగ్గెస్ట్ హిట్ ఉంది. ఇప్పుడు మరోసారి ఆ మ్యాజిక్ ని రిపీట్ చేస్తారేమో చూడాలి.