English | Telugu

స‌క్సెస్‌ఫుల్ హీరో టొవినోతో త్రిష‌!

మ‌ల‌యాళంలో ఇప్పుడు సూప‌ర్‌స‌క్సెస్‌ఫుల్ హీరో టొవినో థామ‌స్‌. ఆయ‌న ప‌క్క‌న న‌టించ‌డానికి త్రిష కృష్ణ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. మాలీవుడ్‌లో ఇప్పుడు ఇది బిగ్ న్యూస్‌. అఖిల్ పాల్, అనాస్ ఖాన్‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. త్రిష మ‌ల‌యాళంలో నివిన్ పాలీ సినిమా హే జ్యూడ్‌తో ఎంట్రీ ఇచ్చారు. ప్ర‌స్తుతం మోహ‌న్‌లాల్ స‌ర‌స‌న థ్రిల్ల‌ర్ రామ్‌లో న‌టిస్తున్నారు. ఇది విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ప్పుడే టొవినో మూవీ ఆఫ‌ర్ త‌లుపు త‌ట్టింది. టొవినో, త్రిష ఇప్ప‌టికే ప‌లు అవార్డుల వేడుక‌ల్లో క‌లుసుకున్నారు. ఒక‌రితో ఒక‌రు మాట్లాడుకునే విధానాన్ని గుర్తుచేసుకుని మురిసిపోతున్నారు ఫ్యాన్స్. వీరిద్ద‌రూ క‌లిసి న‌టిస్తే చూద్దామ‌నుకున్న‌వారి క‌ల నెర‌వేరుతోంది. ఆన్‌స్క్రీన్ మీద వారిద్ద‌రి కెమిస్ట్రీ చూడటానికి ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు.

ఆస్కార్ కోసం ప్ర‌య‌త్నిస్తున్న విక్ర‌మ్‌!

ఏ సినిమాకు సైన్ చేసినా, ప్రాణం పెట్టి ప‌నిచేస్తారు విక్ర‌మ్‌. తీసుకున్న ప్ర‌తి రూపాయికీ న్యాయం జ‌రిగేలా చెమ‌టోడుస్తారు. విక్ర‌మ్ మూవీ రిలీజ్ అంటే, థియేట‌ర్ల‌కు జ‌నాలు బారులు తీయ‌డానికి కార‌ణం కూడా అదే. ఎప్పుడూ త‌న విశ్వ‌రూపాన్ని ఆఫ్ట‌ర్ రిలీజ్ చూపించే విక్ర‌మ్‌,  ఈ సారి మొద‌టి నుంచీ త‌న కేర‌క్ట‌ర్‌ని జ‌నాల‌కు ఇంజెక్ట్ చేయ‌డానికి ట్రై  చేస్తున్నారు. తంగ‌లాన్ సినిమాలో విక్ర‌మ్ లుక్ చూసిన వారు, ఆ ట్రాన్స్ ఫ‌ర్మేష‌న్‌కి క‌ళ్లు చెదిరిపోతున్నాయ‌ని అంటున్నారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజైనా స‌రే, అన్నీ అవార్డులు విక్ర‌మ్‌కి వ‌చ్చి తీరుతాయ‌ని జోస్యం చెబుతున్నారు.