English | Telugu
మృణాల్ ఠాకూర్.. బ్యాక్ టు బ్యాక్ మూవీస్!
Updated : Jul 5, 2023
'సీతారామం' చిత్రంతో తెలుగువారికి చేరువైంది మృణాల్ ఠాకూర్. ఆ బ్లాక్ బస్టర్ మూవీ తెచ్చిన గుర్తింపుతో.. ప్రస్తుతం తెలుగు నాట రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది ఈ టాలెంటెడ్ బ్యూటీ. అందులో ఒకటి నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటిస్తున్న 'నాని ౩౦' (వర్కింగ్ టైటిల్) కాగా..మరొకటి రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న సినిమా. ప్రస్తావించదగ్గ విషయం ఏమిటంటే.. ఈ రెండు చిత్రాలు కూడా తక్కువ గ్యాప్ లోనే తెర పైకి రాబోతున్నాయి.
నానికి జంటగా మృణాల్ నటిస్తున్న మూవీ క్రిస్మస్ స్పెషల్ గా డిసెంబర్ 21న విడుదల కానుండగా.. విజయ్ దేవరకొండకి జోడిగా మిస్ ఠాకూర్ అభినయిస్తున్న ప్రాజెక్ట్ ఏమో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్. మరి.. తక్కువ గ్యాప్ లోనే రాబోతున్న ఈ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో మృణాల్ ఠాకూర్ ఎలాంటి ఫలితాలను పొందుతుందో చూడాలి.