English | Telugu

ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు.. అయినా ఎన్టీఆర్ బావమరిదికి వరుస ఆఫర్స్!

ఇంతవరకు హీరోగా నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ కి ప్రముఖ నిర్మాణ సంస్థల్లో వరుస అవకాశాలు రావడం ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతికి నితిన్ సోదరుడు. 'శతమానం భవతి' ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నితిన్ మొదటి సినిమా 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు' రూపొందింది. సినిమా షూటింగ్ పూర్తయింది, గతేడాది ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. కానీ ఎందుకనో ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. అయినప్పటికీ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో నితిన్ కి వరుస అవకాశాలు వస్తున్నాయి.

'జామ్ జామ్ జ‌జ్జ‌న‌క' పాట వ‌చ్చేసింది.. త‌మ్ముళ్ళూ ఇక సెల‌బ్రేట్ చేసుకోవ‌డ‌మే త‌రువాయి!

మెగాస్టార్ 'భోళా శంక‌ర్' నుంచి కొత్త పాట వ‌చ్చేసింది. "జామ్ జామ్ జామ్ జజ్జ‌న‌క" అంటూ సాగే ఈ పాట యూట్యూబ్ ముంగిట యూనిట్ చెప్పిన టైంకే నిలిచింది. "డ‌ప్పేసుకో.. ద‌రువేసుకో.. వ‌వ్వారే అదిరే పాటేసుకో" అంటూ మొద‌లై ఆపై "జామ్ జామ్ జామ్ జజ్జ‌న‌క‌.. తెల్లార్లు ఆడుదాం తైత‌క్క" అంటూ హుషారు పెంచింది. మ‌ధ్య‌లో "త‌మ్ముళ్ళూ మ‌న‌కు కొంచెం ఛేంజ్ కావాల‌మ్మా.. ద‌రువు మార్చి కొత్త సౌండ్ వేసుకోండి" అంటూ చిరు మాట‌లు తోడ‌య్యాక‌..  పాపుల‌ర్ ఫోక్ సాంగ్ "న‌ర్స‌పల్లి గండిలోని గంగ‌ధారి" నుంచి స్ఫూర్తి పొందిన‌ట్లుగా "న‌ర్స‌ప‌ల్లి గండిలోని గంగ‌ధారి నాటుపిల్లి క‌లిసినాది గంగ‌ధారి" అనే లిరిక్స్ తో సాగి మ‌రింత జోష్ పెంచింది. మొత్త‌మ్మీద‌..  'భోళా శంక‌ర్' చిత్ర బృందం ప్ర‌క‌టించిన‌ట్టే ఇది ప‌క్కా  సెల‌బ్రేష‌న్ సాంగ్ అనే చెప్పొచ్చు.

'బ్రో' సినిమాలో కొత్త పవన్ కళ్యాణ్ ని చూస్తాం!

పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్  కలయికలో పి. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'బ్రో'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే,  డైలాగ్స్ అందిస్తున్నారు. జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ఇతర ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల 'మై డియర్ మార్కండేయ' పాట విడుదలై మెప్పించింది. ఈ నేపథ్యంలో తాజాగా విలేకర్లతో ముచ్చటించిన థమన్ బ్రో సినిమాకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.