'నాయకుడు’ ఎమోషన్ తెలుగు ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అయ్యింది!
ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహద్ ఫాజిల్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలు పోషించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘మామన్నన్’. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ తమిళ చిత్రం సంచలన విజయం సాధించింది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని ‘నాయకుడు’ పేరుతో తెలుగులో విడుదల చేశారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరినీ అలరిస్తున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కీర్తి సురేష్ ఆ మూవీ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు.