English | Telugu

సినిమాలకు బ్రేక్ ఇస్తున్న సమంత!

సమంతకు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి సోకిన సంగతి తెలిసిందే. చికిత్స తీసుకొని కాస్త కోలుకున్న ఆమె, మళ్ళీ సినిమాలు చేస్తున్నారు. మయోసైటిస్ వార్త తెలిశాక ఆమె నటించిన 'యశోద', 'శాకుంతలం' సినిమాలు విడుదలయ్యాయి. అందులో 'యశోద' విజయం సాధించగా, 'శాకుంతలం' పరాజయం పాలైంది. ప్రస్తుతం ఆమె 'ఖుషి' సినిమాతో పాటు 'సిటాడెల్' సిరీస్ లో నటిస్తున్నారు. అయితే వీటి తర్వాత కొంతకాలం నటనను దూరంగా ఉండాలని ఆమె భావిస్తున్నారట.

మయోసైటిస్ కి ముందు వరుస సినిమాలు చేసిన సమంత ఇప్పుడు సినిమాలు బాగా తగ్గించారు. చేతిలో ఉన్న ఒకట్రెండు ప్రాజెక్ట్ లు తప్ప కొత్తవి అంగీకరించట్లేదు. బ్రేక్ తీసుకోవాలన్న ఉద్దేశంతోనే ఆమె ఇతర ప్రాజెక్ట్స్ కి ఓకే చెప్పట్లేదని అంటున్నారు. 'ఖుషి', 'సిటాడెల్' పూర్తయ్యాక ఆమె ఒక ఏడాది బ్రేక్ తీసుకోనున్నారట. మయోసైటిస్ కి అవసరమైన చికిత్స, విశ్రాంతి తీసుకొని.. మరింత దృఢంగా తిరిగి రావాలని ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కాగా విజయ్ దేవరకొండ సరసన 'ఖుషి' సినిమాలో సమంత నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.