English | Telugu

బాల‌య్య 'ముద్దుల మేన‌ల్లుడు'కి 33 ఏళ్ళు!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణకి అచ్చొచ్చిన నిర్మాణ సంస్థ‌ల్లో భార్గ‌వ ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్ కి ప్ర‌త్యేక స్థానం ఉంది. ఈ బేన‌ర్ లో బాల‌య్య న‌టించిన ప‌లు చిత్రాలు నంద‌మూరి అభిమానుల‌ను అల‌రించాయి.   వాటిలో 'ముద్దుల మేన‌ల్లుడు' ఒక‌టి. శ‌తాధిక చిత్రాల ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ తెర‌కెక్కించిన ఈ సినిమాలో బాల‌య్య‌కి జంట‌గా లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి సంద‌డి చేశారు. త‌మిళ చిత్రం 'తంగ‌మాన రాసా' ఆధారంగా రూపొందిన ఈ మూవీలో నాజ‌ర్, బ్ర‌హ్మాజీ, జ‌యంతి, సంగీత‌, బాబూ మోహ‌న్,  ప్ర‌స‌న్న కుమార్, బాలాజీ,  మాడా, వ‌సంత్, కేకే శ‌ర్మ‌, చిడ‌త‌ల అప్పారావు, అనిత‌, ల‌తా శ్రీ‌, క‌ల్ప‌నా రాయ్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మిచ్చారు.