English | Telugu
`వాల్తేర్ వీరయ్య`గా చిరు?
Updated : Aug 23, 2021
చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సీనియర్ స్టార్స్ లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఆయన టైటిల్ రోల్ లో నటించిన `ఆచార్య` చిత్రీకరణ తుది దశకు చేరుకోగా.. `గాడ్ ఫాదర్` ఇటీవలే పట్టాలెక్కింది. మరోవైపు `భోళా శంకర్` కూడా చిత్రీకరణకు సిద్ధమైంది. అదేవిధంగా.. కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో చేయనున్న `చిరు 154` కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.
ఇదిలా ఉంటే.. బాబీ దర్శకత్వంలో చిరు చేయనున్న సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. వైజాగ్ నేపథ్యంలో నడిచే ఈ సినిమాలో నెవర్ సీన్ బిఫోర్ మాస్ రోల్ లో కనిపించబోతున్నారట చిరు. అంతేకాదు.. ఈ చిత్రానికి ముందుగా అనుకున్నట్లుగా `వీరయ్య` అని కాకుండా.. `వాల్తేర్ వీరయ్య` అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. కాగా, అఫీషియల్ టైటిల్ ని చిరంజీవి మొదటి సినిమా విడుదలైన సెప్టెంబర్ 22న రివీల్ చేయబోతున్నట్లు బజ్. త్వరలోనే `చిరు 154` టైటిల్ పై క్లారిటీ రానున్నది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు. 2022 చివరలో ఈ భారీ బడ్జెట్ మూవీ రిలీజయ్యే అవకాశముంది.