English | Telugu
2022 వేసవి నుంచి దసరాకి మారనున్న 'సలార్'?
Updated : Aug 26, 2021
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ - ఇండియా మూవీస్ లో `సలార్` ఒకటి. `కేజీఎఫ్` కెప్టెన్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ సాగాలో శ్రుతి హాసన్ నాయికగా నటిస్తుండగా.. వెటరన్ యాక్టర్ జగపతిబాబు ప్రతినాయకుడి వేషంలో దర్శనమివ్వనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రాన్ని 2022 వేసవి కానుకగా ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్లు చాన్నాళ్ళ క్రితమే మేకర్స్ ప్రకటించారు. కట్ చేస్తే.. ఇప్పుడదే తేదికి ప్రశాంత్ నీల్ రూపొందించిన `కేజీఎఫ్ః ఛాప్టర్ 2` రాబోతోంది. రీసెంట్ గానే.. రిలీజ్ డేట్ ని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు కూడా. దీంతో.. `సలార్` విడుదల తేదిపై ఆసక్తి నెలకొంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. 2022 దసరా స్పెషల్ గా సెప్టెంబర్ చివరి వారంలోగానీ లేదా అక్టోబర్ మొదటి వారంలో గానీ `సలార్` థియేటర్స్ లో సందడి చేసే అవకాశముందంటున్నారు. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.
కాగా, `సలార్` కంటే ముందు పిరియడ్ లవ్ స్టోరీ `రాధే శ్యామ్`తో ప్రభాస్ పలకరించబోతున్నారు. మరోవైపు.. ప్రభాస్ నటిస్తున్న మైథలాజికల్ మూవీ `ఆది పురుష్` ఆగస్టు 11న థియేటర్స్ లోకి రానుంది.