English | Telugu
'వాల్తేర్ శీను'కి ఓటేసిన మెగాస్టార్?
Updated : Aug 26, 2021
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రాబోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందించనున్నారు. చిరు కెరీర్ లో 154వ సినిమాగా ఈ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కనుంది.
ఇదిలా ఉంటే.. చిరు బర్త్ డే స్పెషల్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసిన యూనిట్.. టైటిల్ మాత్రం ప్రకటించలేదు. ముందుగా ఈ సినిమాకి `వీరయ్య` అనే పేరు వినిపించింది. ఆపై `వాల్తేర్ వీరయ్య` అనే టైటిల్ వెలుగులోకి వచ్చింది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఈ మాస్ ఎంటర్టైనర్ కి ఈ రెండు టైటిల్స్ కాకుండా మరో పేరు ఫిక్స్ అయిందట. అదే.. `వాల్తేర్ శీను`. ముందు అనుకున్న రెండు టైటిల్స్ లోనూ పాత వాసన కొట్టడంతో.. మెగాస్టార్ సదరు టైటిల్స్‌కు నో చెప్పారట. ఈ క్రమంలోనే.. `వాల్తేర్ శీను` టైటిల్ గురించి చెప్పగా వెంటనే ఓటేసారని ఇన్ సైడ్ టాక్. త్వరలోనే `చిరు 154` టైటిల్ కి సంబంధించి క్లారిటీ రానుంది.
కాగా, ఈ ఏడాది చివరలో సెట్స్ పైకి వెళ్ళనున్న చిరు - బాబీ కాంబో మూవీ 2022 ద్వితీయార్ధంలో థియేటర్స్ లో సందడి చేయనుంది. ఈ లోపు `ఆచార్య`, `గాడ్ ఫాదర్` చిత్రాలతో పలకరించబోతున్నారు మెగాస్టార్.