English | Telugu
చరణ్ ని ఢీ కొట్టబోతున్న తమన్నా?
Updated : Aug 17, 2021
యూత్ స్టార్ నితిన్ హీరోగా నటించిన `మాస్ట్రో` చిత్రంలో నెగటివ్ రోల్ చేసింది మిల్కీ బ్యూటీ తమన్నా. కట్ చేస్తే.. ఆ సినిమా రిలీజ్ కి ముందే ఓ బిగ్ టికెట్ ఫిల్మ్ లో బ్యాడీ రోల్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.
ఆ వివరాల్లోకి వెళితే.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ - ఇండియా మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ వెంచర్ లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని నాయికగా నటిస్తోంది. మరో ముఖ్య పాత్రలో తెలుగమ్మాయి అంజలి కనిపించబోతున్నట్లు సమాచారం. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఇందులో ఓ ఫిమేల్ విలన్ రోల్ ఉందట. ఆ పాత్రలో తమన్నాని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వినికిడి. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, ఇదివరకు రామ్ చరణ్ కి జోడీగా `రచ్చ`(2012) చిత్రంలో నటించింది తమన్నా. సరిగ్గా పదేళ్ళ తరువాత చరణ్ కి తమన్నా ప్రతినాయకురాలు కానుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. త్వరలోనే `#RC 15`లో తమన్నా ఎంట్రీపై క్లారిటీ రానున్నది.