English | Telugu
పవన్ తో ప్రియమణి రొమాన్స్?
Updated : Aug 28, 2021
బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, జూనియర్ ఎన్టీఆర్, రవితేజ.. ఇలా తెలుగునాట పలువురు అగ్ర కథానాయకులకు జోడీగా అలరించింది ప్రియమణి. పెళ్ళయ్యాక కూడా నటనని కొనసాగిస్తున్న ఈ నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రస్.. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వెబ్-సిరీస్ ల్లోనూ అలరిస్తోంది. తాజాగా `నారప్ప`లో సుందరమ్మగా పలకరించిన ప్రియమణి.. విడుదలకు సిద్ధమైన `విరాట పర్వం`లో కామ్రేడ్ భారతక్కగా దర్శనమివ్వనుంది.
ఇదిలా ఉంటే.. మెగా కాంపౌండ్ హీరోలతో ఇప్పటివరకు కలిసి నటించని ప్రియమణి.. త్వరలో ఆ క్యాంప్ వారి సినిమాలో సందడి చేయనుందట. ఆ వివరాల్లోకి వెళితే.. `గబ్బర్ సింగ్` తరువాత పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్ తండ్రీకొడుకులుగా నటించనున్నారని సమాచారం. అంతేకాదు.. ఇద్దరు నాయికలకు స్థానమున్న ఈ చిత్రంలో మెయిన్ లీడ్ గా పూజా హెగ్డే ఎంపిక కాగా.. తండ్రి పాత్ర సరసన డీ-గ్లామర్ రోల్ లో ప్రియమణి కనిపించనుందని వినికిడి. త్వరలోనే పవన్ - హరీశ్ కాంబో మూవీలో ప్రియమణి ఎంట్రీపై క్లారిటీ రానుంది.