English | Telugu
రి-రిలీజ్ బాటలో 'మన్మథుడు'.. తెరపైకి ఎప్పుడు వస్తాడంటే..!
Updated : Aug 17, 2023
కింగ్ నాగార్జున కెరీర్ లో ఎంతో ప్రత్యేకంగా నిలిచే చిత్రాల్లో 'మన్మథుడు' ఒకటి. ఇందులో అమ్మాయిలంటే పడని యాడ్ ఏజెన్సీ మేనేజర్ అభిరామ్ పాత్రలో భలేగా ఆకట్టుకున్నారు నాగ్. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కె. విజయభాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమాలో నాగార్జునకి జంటగా సోనాలి బింద్రే, అన్షు (తొలి పరిచయం) నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగ్ స్వయంగా నిర్మించిన మన్మథుడుకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు ప్రధాన బలంగా నిలిచాయి.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం సాగుతున్న రిరిలీజ్ ట్రెండ్ లో భాగంగా 'మన్మథుడు'ని మళ్ళీ తెరపైకి తీసుకువస్తే చూడాలని చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు తగ్గట్టుగా రిరిలీజ్ కి రెడీ అయ్యాడు 'మన్మథుడు'. కింగ్ బర్త్ డే స్పెషల్ గా ఆగస్టు 29న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పైకి వస్తోంది. మరి.. 21 సంవత్సరాల తరువాత మరోసారి తెరపైకి రాబోతున్న 'మన్మథుడు'.. ఈ సారి కూడా వసూళ్ళ వర్షం కురిపిస్తాడేమో చూడాలి.