English | Telugu

'భోళా శంకర్' ఆరో రోజు కలెక్షన్స్.. ఆ ఏరియాల్లో 'జీరో' షేర్.. మెగాస్టార్ కి నెవర్ బిఫోర్ ఫెయిల్యూర్!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఇండస్ట్రీ హిట్స్, సూపర్ హిట్స్, హిట్స్ ఉన్నట్లే చెప్పుకోదగ్గ సంఖ్యలో ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. అయితే అతని తాజా చిత్రం 'భోళా శంకర్' మాత్రం నెవర్ బిఫోర్ ఫెయిల్యూర్ ట్యాగ్ ని సొంతం చేసుకుంటోంది. ఎందుకంటే.. అనూహ్యంగా ఆరో రోజే ఈ సినిమా 'జీరో' షేర్స్ చూసింది. నాలుగో రోజైన సోమవారం నాడే రూ. లక్షల్లో కనిపించిన 'భోళా శంకర్' షేర్.. సెలవుదినమైన పంద్రాగస్టున అంటే ఐదో రోజున రూ. కోటికి కాస్త ఎక్కువగా షేర్ రాబట్టింది. కానీ ఆరో రోజైన బుధవారం మాత్రం నిరాశజనక వసూళ్ళు చూసింది.

తెలుగు రాష్ట్రాల్లో ఆరో రోజు కేవలం రూ. 10 లక్షల షేర్ మాత్రమే చూసింది. "మెగాస్టార్ అడ్డా" అని చెప్పుకునే 'నైజాం' లాంటి ఏరియాలోనూ, గుంటూరు ప్రాంతంలోనూ 'జీరో' షేర్స్ రావడం ట్రేడ్ వర్గాలను విస్మయపరుస్తోంది. గతంలోనూ మెగాస్టార్ ఖాతాలో కొన్ని డిజాస్టర్స్ ఉన్నప్పటికీ మరీ ఆరో రోజున 'జీరో' షేర్స్ వచ్చిన సందర్భాలు తక్కువే. అది కూడా.. నైజాం లాంటి ఏరియాలో. మొత్తమ్మీద.. 'భోళా శంకర్' సినిమా ఫలితం ఇటు ప్రేక్షక వర్గాలను, అటు పరిశ్రమ వర్గాలను ఆశ్చర్యపరిచే, ఆలోచింపజేసేఅంశమనే చెప్పాలి.

ఆరో రోజు 'భోళా శంకర్' ఏరియా వైజ్ కలెక్షన్స్:

నైజాం: రూ. 0 లక్షలు
సీడెడ్ : రూ. 2 లక్షలు
ఉత్తరాంధ్ర : రూ. 2 లక్షలు
ఈస్ట్ గోదావరి: రూ. 2 లక్షలు
వెస్ట్ గోదావరి : రూ. 1 లక్ష

గుంటూరు: రూ. 0 లక్షలు
కృష్ణ: రూ.2 లక్షలు
నెల్లూరు: రూ. 1 లక్ష

తెలుగు రాష్ట్రాల్లో ఆరో రోజు కలెక్షన్స్ :- రూ. 0.10 లక్షలు(రూ. 0.25 లక్షల గ్రాస్)

కాగా, ప్రపంచవ్యాప్తంగా 'భోళా శంకర్' ఆరు రోజుల్లో మొత్తం రూ. 27.08 కోట్ల షేర్ చూసింది. ఓవరాల్ గా.. రూ. 50 కోట్ల వరకు ఈ సినిమా నష్టాలు చూడబోతోందని ట్రేడ్ టాక్.


పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.