English | Telugu
ఓటీటీలో 'బేబీ' సందడి!
Updated : Aug 17, 2023
ఇటీవల చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రం 'బేబీ'. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి సాయి రాజేష్ దర్శకుడు. మాస్ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం జూలై 14 న విడుదలై యూత్ ని విశేషంగా ఆకట్టుకుంది. రూ.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ ఏకంగా రూ.40 కోట్లకు పైగా షేర్ రాబట్టి సంచలన విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది.
'బేబీ' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ వేదిక ఆహా దక్కించుకుంది. త్వరలోనే ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా ఆహా ప్రకటించింది. "ఆహా అంటే అందరికీ ఇష్టం.. రేపు బేబీ మూవీ అప్డేట్ ఇస్తాం" అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. అంటే 'బేబీ' ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై క్లారిటీ రానుంది. అయితే ఈ సినిమా ఆగస్టు 24 లేదా 25 నుంచి ఓటీటీ అందుబాటులోకి రానుందని సమాచారం.
ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించగా.. ఎం.ఎన్. బాలిరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా, విప్లవ్ ఎడిటర్ గా వ్యవహరించారు.