English | Telugu
వందకు పైగా థియేటర్లలో 'రఘువరన్ బి.టెక్' రీరిలీజ్.. అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్!
Updated : Aug 17, 2023
టాలీవుడ్ లో కొంతకాలంగా రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా ఈ రీరిలీజ్ ట్రెండ్ లో సత్తా చాటుతున్నాయి. ఇటీవల 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు 'రఘువరన్ బి.టెక్' కూడా అలాంటి మ్యాజిక్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి.
ధనుష్ తమిళ చిత్రం 'వేలై ఇళ్ళ పట్టదారి'.. తెలుగులో 'రఘువరన్ బి.టెక్' పేరుతో 2015, జనవరి 1న విడుదలై తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. 'స్రవంతి' రవికిశోర్ తెలుగులో విడుదల చేయగా.. యూత్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు. ఎనిమిదేళ్లకే ఇప్పుడు ఈ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాను శుక్రవారం(ఆగస్టు 18న) రీరిలీజ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వందకు పైగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికేబుకింగ్స్ ఓపెన్ కాగా, మంచి స్పందన లభిస్తోంది.
'రఘువరన్ బీటెక్' రీ రిలీజ్ సందర్భంగా 'స్రవంతి' రవికిశోర్ మాట్లాడుతూ ''కొన్ని సినిమాలను ఎవర్ గ్రీన్ మూవీస్ అంటుంటాం. అటువంటిచిత్రమే 'రఘువరన్ బి.టెక్'. ప్రతి తరంలోని విద్యార్థులకు కనెక్ట్ అయ్యే చిత్రమిది. స్టూడెంట్స్, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్, కెరీర్ స్ట్రగుల్స్గురించి బాగా డిస్కస్ చేశారు. ప్రముఖ దర్శకుడు కిశోర్ తిరుమల తెలుగు డైలాగ్స్ రాశారు. డబ్బింగ్ డైలాగ్స్ తరహాలో కాకుండా ఆయన రాసిన మాటలన్నీఒరిజినల్ సినిమాకు రాసినట్టు రాశారు. ధనుష్ అయితే పాత్రలో జీవించారు. ఆయనలో చాలా మంది విద్యార్థులు తమనుతాము చూసుకున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే ఇప్పటికీ చూసుకుంటున్నారని అనిపిస్తోంది. ప్రజెంట్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన అనిరుధ్ కెరీర్ స్టార్టింగ్‌లో చేసిన సినిమాల్లో ఇదీ ఒకటి.ఎక్స్‌ట్రాడినరీ సాంగ్స్ అందించారు. రీ రికార్డింగ్ కూడా అద్భుతంగా ఉంది. తెలుగులో అనిరుధ్ ఫస్ట్ హిట్ ఇది. ఈ సినిమా తర్వాత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది'' అని అన్నారు.
ధనుష్ సరసన అమలాపాల్కథానాయికగా నటించిన ఈ సినిమాలో సురభి కీలక పాత్రధారి. వేల్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శరణ్య, సముద్రఖని, వివేక్, హృషికేష్, అమితాష్ప్రధాన్ ముఖ్య పాత్రలు పోషించారు.