English | Telugu
మెగా బ్రదర్స్ రీమేక్స్ ఎఫెక్ట్.. రెండు వారాల వ్యవధిలో రూ.80 కోట్ల నష్టం!
Updated : Aug 17, 2023
రీమేక్స్ వద్దంటూ ఫ్యాన్స్ ఎంత మొత్తుకుంటున్నా.. మెగా బ్రదర్స్ మాత్రం "రీమేక్స్ చేస్తే తప్పేంటి?" అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు. అయితే రీమేక్స్ విషయంలో ఒకప్పటి పరిస్థితి ఎలా ఉన్నా.. ఓటీటీ ట్రెండ్ లో మాత్రం వాటికి ఒక రకంగా కాలం చెల్లిందనే చెప్పాలి. కేవలం రెండు వారాల వ్యవధిలో విడుదలైన రెండు మెగా ప్రాజెక్ట్స్ కి వచ్చిన నిరాశజనక ఫలితాలే ఇందుకు తాజా నిదర్శనం.
ఆ వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది జూలై 28న జనం ముందు నిలిచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం 'బ్రో'. తమిళ సినిమా 'వినోదయ సిత్తం' ఆధారంగా మాతృక దర్శకుడు పి. సముద్రఖని తెరకెక్కించిన 'బ్రో'.. ఫస్ట్ వీకెండ్లో మంచి వసూళ్ళు ఆర్జించినప్పటికీ ఓవరాల్ గా రూ. 30 కోట్లకు పైగా నష్టాన్ని చూస్తోందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇక ఆగస్టు 11న వచ్చిన మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'భోళా శంకర్' విషయానికి వస్తే.. మరో తమిళ సినిమా 'వేదాళమ్' ఆధారంగా మెహర్ రమేశ్ తెరకెక్కించిన ఈ మూవీకొన్ని చోట్ల ఆరో రోజే 'జీరో' షేర్స్ చూసి ట్రేడ్ ని విస్మయపరిచింది. ఓవరాల్ గా ఈ సినిమాకి రూ. 50 కోట్ల వరకు నష్టం తప్పదని అంచనా వేస్తున్నారు. అంటే.. మెగా బ్రదర్స్ తాజా రీమేక్స్కేవలం రెండు వారాల్లో రూ. 80 కోట్ల నష్టం మూటగట్టుకున్నట్టే. ఈ ఫలితాలు చూసి ఇటు ప్రేక్షకులు, అటు పరిశ్రమ వర్గాలు.. "రీమేక్స్ విషయంలో ఇకనైనా ఆలోచించాల్సిందే బాసూ!" అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు