English | Telugu

బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'గదర్ 2'.. తెలుగు వెర్షన్ రెడీ!

బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ చాలా కాలం తరువాత బ్లాక్ బస్టర్ అందుకున్నారు. పంద్రాగస్టు ప్రత్యేకంగా గత శుక్రవారం విడుదలైన 'గదర్ 2' ఘనవిజయంతో మరోసారి వార్తల్లో నిలిచారు సన్నీ. 2001లో విడుదలై అఖండ విజయం సాధించిన 'గదర్'కి కొనసాగింపుగా రూపొందిన ఈ సినిమా.. బాక్సాఫీస్ ముంగిట అనూహ్య రీతిలో ముందుకు సాగుతోంది. కేవలం ఆరు రోజుల్లో రూ. 261. 35 కోట్ల నెట్ ఆర్జించి టాక్ ఆఫ్ ఇండస్ట్రీగా నిలిచింది.

ఇదిలా ఉంటే, 'గదర్ 2'ని తెలుగు, తమిళ భాషల్లో అనువాదం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్నీ కుదిరితే ఈ నెలలోనే 'గదర్ 2' డబ్బింగ్ వెర్షన్ జనం ముందుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి.. హిందీ ప్రేక్షకులను విపరీతంగా నచ్చేసిన 'గదర్ 2'.. ఇక్కడివారిని కూడా రంజింపజేస్తుందేమో చూడాలి.

కాగా, 'గదర్ 2'లో సన్నీ డియోల్ కి జంటగా అమీషా పటేల్ నటించగా.. 'గదర్' ఫేమ్ అనిల్ శర్మ దర్శకత్వం వహించారు. మిథున్, మాంటీ శర్మ సంగీతమందించారు. 170 నిమిషాల రన్ టైమ్ తో ఈ సినిమా రిలీజైంది.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.