English | Telugu
రామ్ చరణ్ న్యూ లుక్ అదిరిపోయింది!
Updated : Aug 17, 2023
ఆన్ స్క్రీన్ అయినా, ఆఫ్ స్క్రీన్ అయినా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లుక్ కి ఎందరో ఫ్యాన్స్ ఉంటారు. తాజాగా ఆయన తన న్యూ లుక్ తో సర్ ప్రైజ్ చేశారు. చరణ్ న్యూ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'గేమ్ ఛేంజర్'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని వినికిడి. ఇందులో చరణ్ లుక్స్ ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, చరణ్ లుక్ కి సంబంధించిన ఇతర ఫొటోలు ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ సెట్స్ లో దిగిన ఫోటోలలో చరణ్ లుక్ మెస్మరైజ్ చేస్తోంది.
ఈరోజు(ఆగస్టు 17) దర్శకుడు శంకర్ పుట్టినరోజు కావడంతో సెట్స్ లో చిత్రబృందం సెలబ్రేట్ చేసింది. ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకోగా.. వాటిలో రామ్ చరణ్, శంకర్, దిల్ రాజు ఉన్నారు. ఇక ఆ ఫోటోలలో చరణ్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్లీన్ షేవ్, షార్ట్ హెయిర్, మీసకట్టు, కళ్ళద్దాలతో వైట్ టి-షర్ట్ ధరించి ఉన్న చరణ్ లుక్ కట్టిపడేస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.