English | Telugu
‘ఖుషి’ రన్ టైమ్ రిస్క్.. డైరెక్టర్ కామెంట్స్
Updated : Aug 31, 2023
యూత్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ఖుషి’. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న రిలీజ్ అవుతోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. సమంత హీరోయిన్‌గా అలరించనుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అబ్బాయి, అమ్మాయి మధ్య వచ్చే మనస్పర్దలు ఎలా ఉంటాయి అనే కాన్సెప్ట్‌తో లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ఇది రూపొందింది. ట్రైలర్ చూస్తుంటే డైరెక్టర్ శివ నిర్వాణ ఈ సినిమాతో ఏం చెప్పాలనుకుంటున్నారనేది క్లియర్‌గా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన విషయమొకటి నెట్టింట వైరల్ అవుతోంది. అదే రన్ టైమ్.
సాధారణంగా ఇప్పుడు వస్తున్న సినిమాల్లో ఎక్కువ భాగం రెండున్నర గంటల లోపే రన్‌టైమ్‌తో ఉంటున్నాయి. కానీ ఖుషి సినిమా మాత్రం రెండు గంటల నలబై ఐదు నిమిషాల రన్ టైమ్‌తో ఉంది. ఓ లవ్ సబ్జెక్ట్‌కి ఇంత రన్ టైమ్ అవసరమా? అని శివ నిర్వాణను ప్రశ్నించినప్పుడు ‘నేను ఫస్ట్ కట్ చేసిప్పుడు చూశాను. నా టీమ్‌కు రీ రికార్డింగ్ తర్వాత కూడా సినిమాను చూపించాను. సినిమా రన్ టైమ్‌పై ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. సినిమాను ఆ లెంగ్త్‌లో చెప్పాల్సిన అవసరం ఉందనిపించింది’ అని అన్నారు డైరెక్టర్ శివ నిర్వాణ.
నిన్నుకోరి, మజిలీ చిత్రాలతో సక్సెస్ సాధించిన శివ నిర్వాణ స్పీడుకి టక్ జగదీష్ బ్రేకులేసిందనే చెప్పాలి. ఇప్పుడు ‘ఖుషి’ సినిమాతో ఎలాగైనా హిట్ కొడతాననే నమ్మకంతో ఉన్నారాయన. ఇక విజయ్ దేవరకొండ సైతం ‘లైగర్’ డిజాస్టర్ తర్వాత చేస్తోన్న సినిమా ఇది. తను కూడా దీనిపై చాలా హోప్స్ పెట్టుకున్నారు మరి.