English | Telugu

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సీక్వెల్ రిలీజ్ డేట్ వచ్చేసింది!

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అంటూ 'బాహుబలి-2' కోసం అప్పుడు ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూశారో.. చనిపోయిన కవిత ఎలా తిరిగొచ్చింది? అంటూ ఇప్పుడు 'మా ఊరి పొలిమేర-2' కోసం కొందరు ప్రేక్షకులు అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

'మా ఊరి పొలిమేర' అనేది చేతబడి నేపథ్యంలో రూపొందిన మర్డర్ మిస్టరీ ఫిల్మ్. ఆచార్య క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాకు విశ్వనాథ్‌ దర్శకత్వం వహించాడు. సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, రమ్య, గెటప్‌ శ్రీను, రవి వర్మ, చిత్రం శ్రీను ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీలో 2021 డిసెంబర్ 10 న విడుదలైంది. ఏమాత్రం అంచనాల్లేకుండా నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్ర కథనం, ట్విస్ట్ లు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ రెండో భాగంపై ఆసక్తి కలిగేలా చేసింది. దాంతో 'మా ఊరి పొలిమేర-2' కోసం ఓ వర్గం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఎట్టకేలకు రెండో భాగం రిలీజ్ డేట్ క్లారిటీ వచ్చింది. రెండో భాగాన్ని నవంబర్ 2 న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. రెండో భాగం మొదటి భాగాన్ని మించి ఉంటుందని మూవీ టీమ్ చెబుతోంది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.