English | Telugu

గౌతమ్‌ బర్త్‌ డే: విషెస్‌తో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసిన మహేష్‌, నమ్రత, సితార

మహేష్‌బాబు ఫ్యామిలీ ఫ్యాన్స్‌కి ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ఎప్పటికప్పుడు తమ ఫ్యామిలీకి సంబంధించి విశేషాలను పోస్ట్‌ చేస్తుంటారు. ముఖ్యంగా మహేష్‌ తన కుటుంబంలో ఏం జరిగినా, వారు ఏ టూర్‌కి వెళ్ళినా దానికి సంబంధించిన విశేషాలను స్పెషల్‌గా పోస్ట్‌ చేస్తాడు. ఈరోజు (ఆగస్ట్‌ 31) మహేష్‌ తనయుడు గౌతమ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా మహేష్‌, నమ్రత, సితార చేసిన పోస్టులు బాగా వైరల్‌ అవుతున్నాయి.
మహేష్‌: నా చాంపియన్‌ 17వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. గౌతమ్‌... నువ్వు వేసే స్టెప్‌ టార్గెట్‌ దగ్గరగా నిన్ను తీసుకెళ్ళాలి. నువ్వు ఆకాశాన్ని, నక్షత్రాలను అందుకోవాలి. లవ్‌ యూ సో మచ్‌.
నమ్రత: హ్యాపీ హ్యాపీ బర్త్‌ డే జీజీ (గౌతమ్‌ ఘట్టమనేని). ప్రతి సంవత్సరం ముందుకు వెళ్తూ మమ్మల్ని గర్వపడేలా చేస్తున్నావు. నువ్వు ఇంకా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. నువ్వు కన్న కలలు నిజం కావాలి. వచ్చే సంవత్సరం నువ్వు ఎలాగూ ఇండియాలో ఉండవు. విదేశాలకు వెళ్లిపోతావు. అందుకే ఈ బర్త్‌డే ను స్పెషల్‌గా సెలబ్రేట్‌ చేస్తాను.
సితార: నువ్వే నాకు ఆధారం, మూలం అన్నయ్య. నువ్వే నా ప్రపంచం అన్నయ్య. ఐ లవ్‌ యు సో మచ్‌. హ్యాపీ బర్త్‌ డే టు బెస్ట్‌ బ్రదర్‌.
ఈ పోస్టులు చూసిన ఫ్యాన్స్‌ ఎంతో హ్యాపీగా ఫీల్‌ అవుతున్నారు. మహేష్‌ ఫ్యామిలీ అంటే నెటిజన్లు ఎంతో ఇష్టపడతారు. వారు పెట్టే పోస్టులకు ఎంతో పాజిటివ్‌గా రెస్పాండ్‌ అవుతారు.
ఇక గౌతమ్‌ గురించి చెప్పాలంటే తండ్రిలాగే ఎంతో సాఫ్ట్‌గా ఉంటూ ఎలాంటి హడావిడి చేయకుండా కామ్‌గా ఉండే తత్వం. ఇటీవల మహేష్‌ బాబు ఫౌండేషన్‌ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలను పర్యవేక్షించాడు గౌతమ్‌. రెయిన్‌బో హాస్పిటల్‌కి వెళ్లి.. కార్డియాలజీ, అంకాలజీ వార్డుల్లో ఉన్న పిల్లలతో టైమ్‌ స్పెండ్‌ చేశాడు. వారితో ముచ్చటించి సరదాగా గడిపాడు. ఈ విషయం గురించి నెటిజన్లు ఎంతో పాజిటివ్‌గా స్పందించారు. మంచి మనసున్న మనిషి గౌతమ్‌ అంటూ అప్రిషియేట్‌ చేస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.