English | Telugu

కార్తికేయకి మరోసారి కలిసొచ్చిన 'శివ'

'ప్రేమతో మీ కార్తీక్' అంటూ కథానాయకుడిగా అరంగేట్రం చేసిన కార్తికేయకి.. రెండో చిత్రమైన 'ఆర్ ఎక్స్ 100' సాలిడ్ హిట్ ని అందించింది. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు ఈ యంగ్ హీరో. అయితే ఆ తరువాత వచ్చిన 'హిప్పీ', 'గుణ 369', 'గ్యాంగ్ లీడర్' (విలన్ రోల్), '90 ఎం.ఎల్', 'చావు కబురు చల్లగా', 'రాజా విక్రమార్క', 'వలిమై' (విలన్ రోల్) డిజప్పాయింట్ చేశాయి.

ఈ నేపథ్యంలో.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కార్తికేయ తాజా చిత్రం'బెదురులంక 2012' మంచి ఫలితాన్నే అందించింది. మంగళవారంతో బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా, ప్రాఫిట్ జోన్ లోకి కూడా వెళ్ళిపోయిందీ సినిమా. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. 'ఆర్ ఎక్స్ 100', 'బెదురులంక 2012' సినిమాల్లో కార్తికేయ స్క్రీన్ నేమ్ ఒకటే. అదే.. 'శివ'. మరి.. భవిష్యత్ లోనూ కార్తికేయ 'శివ' సెంటిమెంట్ ని కొనసాగిస్తాడేమో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.